సమాధి చేసిన మొదటి రాత్రి

బుధ, 03/24/2021 - 13:21

సమాధి చేసిన మొదటి రాత్రి నకీర్ మున్కిర్ ద్వార చేయబడే ప్రశ్నలకు సమాధానాలు...

సమాధి చేసిన మొదటి రాత్రి

ముస్లిములందరీ నమ్మకం ప్రకారం, మరణించిన మొదటి రాత్రి మనిషికి కొన్ని ప్రశ్నలు చేయబడతాయి. అతడు చేసిన చర్యల గురించి అతడి నమ్మకాల గురించి ప్రశ్నించబడుతుంది. రివాయతుల ప్రకారం అల్లాహ్ తరపు నుండి ఇద్దరు దైవదూతలు వస్తారు, వారి పేర్లు నకీర్ మరియు మున్కిర్.
ఇక్కడ ప్రశ్నేమిటంటే వారు అడిగే ప్రశ్నలు ఏమిటీ? మరియు వారి ప్రశ్నలకు ఏలా సమాధానమివ్వాలి?
అహ్లెబైత్(అ.స)ల ద్వార ఉల్లేఖించబడ్డ రివాయతులనుసారం, వారి ప్రశ్నలు మనిషి మూల విశ్వాసాల గురించి మరియు ఇస్లాం ధర్మం విధిగా నిర్ధారించిన చర్యల గురించి ఉంటాయి; అల్లాహ్ గురించి, దైవప్రవక్త మరియు ఇమాముల గురించి, వారు నమ్మే ధర్మం గురించి, చేసే పనుల గురించి.

హజ్రత్ ఇమామ్ కాజిమ్(అ.స) వాటి గురించి ఇలా ఉల్లేఖించారు: “మనిషితో అతడి సమాధిలో ఇలా ప్రశ్నించబడుతుంది: నీ ప్రభువు ఎవడు? నీ ధర్మమేమిటీ? నీ ప్రవక్త ఎవరు? నీ ఇమామ్ ఎవరు?[1]
ముఖ్యమైన విషయమేమిటంటే మనిషి ఈ ప్రశ్నల సమాధానం తన విశ్వాసాల మరియు చర్యలను బట్టి ఇస్తాడు, విశ్వాసాలను గట్టిగా నమ్మి వాటిని తన జీవితంలో అమలు పరిచి ఉంటేనే సమాధానం ఇవ్వగలడు ఎందుకంటే అక్కడ నోటితో సమాధానం ఇవ్వలేము. అందుకే ఉలమాలు ఇలా నమ్ముతార అక్కడ మన హృదయం మరియు మన ఆత్మ ఆ ప్రశ్నలకు సమాదానమిస్తాయి, ఆ సమయంలో నోరు మూగబోతుంది మరియు మన ప్రవర్తనే సమాధానమిస్తుంది.[2]
ఉదాహారణకు; మనిషి ఎవరి పట్ల విధేయతగా ఉంటాడో అదే అతడి ప్రభువు, ఒకవేళ మనిషికి కేవలం తిండి మరియు పొట్టను ఎలా నింపుకోవాలనే విషయమే ముఖ్యమైనదై ఉంటే నిస్సందేహముగా మరణించిన తరువాత నీ ప్రభువు ఎవరు అని ప్రశ్నించినపుడు “నా ప్రభువు నా పొట్ట” అని సమాధానమిస్తాడు. లేదా ఒకడు మనోవాంఛలనే ముఖ్యమైనవిగా భావిస్తాడో, నిస్సందేహంగా రేపు మరణించిన తరువాత నా ప్రభువు మనోవాంఛలు అని సమాధానమిస్తాడు.

పైవివరణ పట్ల అహ్లెబైత్(అ.స) యొక్క రివాయతులు కూడా ఉన్నాయి. ఉదాహారణకు; దైవప్రవక్త(స.అ) ఇలా ఉల్లేఖించారు: బర్జఖ్ ప్రపంచంలో ప్రభువు గురించి ప్రశ్నిస్తే, ఇలా చెబుతాడు: నా పొట్ట నా పొట్ట. ఇలా చెబుతారు: నీ ఖర్మ, ఇప్పుడు నువ్వు నీ ప్రభువును ఆశ్రయించు, నీ పొట్టతో నిన్ను మేము విధించే శిక్ష నుండి కాపాడమని కోరుకో; మరొకడితో నీ ప్రభువు ఎవరు అని ప్రశ్నిస్తే అతడు నా భార్య అని మరొకడు నా కుమారుడని సమాధానాలిస్తారు.[3]

ఔను, నీ ప్రభువు ఎవరు అనే ప్రశ్నకు అబద్ధంగా అల్లాహ్ అని సమాధానం ఇవ్వడానికి నోరు పడిపోతుంది, అక్కడ మనిషి స్వభావం, నడవడికలు మాత్రమే మాట్లాడగలవు., ఎవరి దాసోహాన్ని చాటుకున్నారో అదే నోటి నుండి వస్తుంది. నిస్సందేహంగా నీ ప్రభువు ఎవరు? అనే ప్రశ్నకు కొందరు నా వ్యాపారమనీ, కొందరు నా ధనమనీ, కొందరు నా పదవి అనీ, కొందరు నా జ్ఞానమనీ, కొందరు నా వంశమనీ సమాధానం ఇస్లారు. ఇవన్నీ జీవితాంతం వాటికోసం నీవు ప్రయత్నించిన నీ ప్రభువులు, వాటిని పొందడానికి నీవు అల్లాహ్ ఆదేశాలను చూసిచూడనట్లుగా వదిలేశావు, అడ్డదారులు తొక్కావు.

ఔను, బర్జఖ్ ప్రపంచం, రహస్యాలను వెల్లడించే మరియు యదార్థాలను స్పష్టం చేసే ప్రపంచం; ఖుర్ఆన్ ఇలా వివరించెను: “ఆ రోజున అందరూ బయల్పడతారు. అప్పుడు వారి(లోగుట్టు) విషయమేదీ అల్లాహ్ నుండి దాగి ఉండదు. ఈ రోజు విశ్వసార్వభౌమత్వం ఎవరిది? ఒక్కడైన, తిరిగులేనివాడైన అల్లాహ్ ది మాత్రమే”[సూరయె గాఫిర్, ఆయత్16]
అయితే నిజమైన విశ్వాసులు తన జీవితంలో అల్లాహ్ ను ఎట్టి పరిస్థితులలోనూ మరచిపోరు, నిత్యం ఆయన ఆదేశాలను పాటించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మనోవాంఛలకు దూరంగా ఉంటారు. నిజమైన అల్లాహ్ దాసుడై ఉంటే అతడు నిస్సందేహముగా నీ ప్రభువు ఎవరు? అని ప్రశ్నిస్తే నా ప్రభువు భూమ్యాకాశాలను సృష్టించిన అల్లాహ్ అని సమాధానమిస్తాడు. విశ్వాసులే బర్జఖ్ మరియు ఖియామత్ లో చాలా మనశాంతితో ఉంటారు.

ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) విశ్వాసుల గురించి ఇలా ఉల్లేఖించెను: సమాధిలో చేయబడే ప్రశ్నలకు మనిషి సరైన సమాధానం ఇస్తే అతడి సమాధి 70 జిరా(ఒక్క జిరా అరమీటరు) విశాలమౌతుంది, మరియు స్వర్గపు తలుపుల నుండి ఒక తలుపు అతడివైపుకు తెరుచుకుంటుంది....”[4]

రిఫరెన్స్
1. అల్ కాఫీ, భాగం3, పేజీ238
2. మఆద్ షినాసీ, భాగం2, పేజీ254
3. బిహారుల్ అన్వార్, భాగం22, పేజీ453
4. అల్ కాఫీ, భాగం3, పేజీ238       

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10