అహ్లెసున్నత్ ఫిఖా మూలాధారాలు

ఆది, 02/20/2022 - 18:57

షరిఅత్‌ ఆదేశాల కోసం అహ్లెసున్నత్ వల్ జమాఅత్‌లు ఆశ్రయించే మూలాధారాల వివరణ సంక్షిప్తంగా...

అహ్లెసున్నత్ వల్ జమాఅత్‌ల మూలాధారాలు

మేము అహ్లెసున్నత్ వల్ జమాఅత్
ల షరా యొక్క మూల ఆధారాల గురించి పరిశోధించినప్పుడు చాలా విషయాలు ఖుర్ఆన్ మరియు హదీస్ హద్దులను దాటాయి, అని మనకు తెలిసి వస్తుంది.
ఖుర్ఆన్ మరియు సున్నత్
లే కాకుండా వారి షరా యొక్క ములాధారాలు, ఖులాఫాయే రాషిదీన్ల సున్నత్, సహాబీయుల సున్నత్, తాబెయీన్ల సున్నత్, ఉలమాల అభిప్రాయం, అధికారుల సున్నత్ దీనినే అహ్లెసున్నత్
లు “సవాఫిల్ ఉమరా” అంటారు, ఖియాస్, ఇస్తిహ్సాన్, ఇజ్మా మరియు సద్దు బాబిజ్జరాయే కూడా ఉన్నాయి.
మీరు తిలకించినట్లే అహ్లెసున్నత్
ల దృష్టిలో షరా యొక్క మూలాధారాలు 10 ఉన్నాయి. మరియు ప్రతీ దాని ద్వారా అల్లాహ్ దీన్
లో ఫత్వా ఇవ్వబడుతుంది. మా మాటలు సాక్ష్యాలు లేనివి కాకుడదు, అనీ. మరియు మేము అతివృష్టికి గురయ్యామని అపనింద వేయకూడదు, అనీ. వారి పుస్తకాల నుండే వారి ప్రవచనాల ద్వారనే సాక్ష్యాలు ప్రదర్శిస్తాము. దాంతో పాఠకులకు యదార్ధం అర్ధం అవుతుంది.
మొదటి రెండు మూలాధారాల(ఖుర్ఆన్ మరియు సున్నత్) విషయంలో షియా మరియు అహ్లెసున్నత్ వల్ జమాఅత్
కు ఎటువంటి విభేదం లేదు. అంతేకాదు దాని పై ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. ఆ రెండింటిని ఆశ్రయించడం, బుద్ది పరంగా నఖ్ల్ మరియు ఇజ్మా పరంగా కూడా వాజిబ్ అని నిరూపిస్తున్నాయి. మరియు అల్లాహ్ యొక్క ఈ ప్రవచనానికి నిదర్శనం:
وَمَآ ءَاتَىٰكُمُ ٱلرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَىٰكُمۡ عَنۡهُ فَٱنتَهُواْۚ
అనువాదం: దైవప్రవక్త(స.అ) మీకు ఇచ్చిన దానిని (సంతోషంగా) పుచ్చుకోండి. ఆయన ఏ విషయం నుండైనా మిమ్మల్ని వారిస్తే, దానిని వదిలి పెట్టండి.[హష్ర్ సూరా:59, ఆయత్:7]
وَأَطِيعُواْ ٱللَّهَ وَأَطِيعُواْ ٱلرَّسُولَ
అనువాదం: అల్లాహ్ కు విధేయత చూపండి. ఆయన ప్రవక్తకు విధేయత చూపండి.[మాయిదహ్ సూరా:5, ఆయత్:92.]
إِذَا قَضَى ٱللَّهُ وَرَسُولُهُ...
అనువాదం: అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (ఒక) నిర్ణయం తీసుకు న్నప్పుడు...[అహ్జాబ్ సూరా:33 ఆయత్:36] 

అలాగే మరెన్నో స్పష్టమైన ఆయత్
లు “అల్లాహ్ గ్రంథం మరియు దైవప్రవక్త ముహమ్మద్(స.అ) ద్వార అహ్కాములు పొందడం విధి” అని నిరూపిస్తున్నాయి.
కాని అహ్లెసున్నత్
లు, తమ తరపు నుండి సృష్టించుకున్నటువంటి మూల ఆధారాలములలోనే వారికి మనకు వ్యతిరేకత ఉంది.

రిఫరెన్స్
మజల్లయె నూరె ఇల్మ్, ఖుర్దాద్ 1364, షుమారహ్10, పేజీ55-62.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10