ప్రతీ పనిని బిస్మిల్లహ్ తో మొదలుపెట్టండి

మంగళ, 01/23/2018 - 19:44

ఈ లోకంలో అన్ని పేర్లలో సర్వోత్తమమైన పేరు ఆ అల్లాహ్ పేరే దానితో మీ పనులను ఆరంభించడంలోనే మీకు ఆ దేవుని కృప మరియు వృధ్ధి, లాభం అన్ని సమకూరుతాయి.
 

ప్రతీ పనిని బిస్మిల్లహ్ తో మొదలుపెట్టండి

ఈ ప్రపంచంలో నివసించే మానవులందరు తమ ప్రతీ పనిని పెద్దలతో లేదా వారి పేరుతో మొదలుపెడతారు మరియు దానికి నామకరణం కూడ పెద్దల పేరు మీదే చేస్తారు, అదే విధంగా ఇస్లాం కూద ప్రతీ పనిని ఈ ప్రపంచానికే పెద్ద దిక్కు అయినటువంటి అల్లాహ్ పేరు మీదే ఆరంభించమని ఆజ్ఞిస్తుంది.
మరియు ఆ అల్లాహ్ పేరుతో ఆరంభించడానికి గల ప్రాముఖ్యత కూడా హదీసులలో ప్రస్థావించడం జరిగింది, మహనీయ ప్రవక్త[స.అ.వ] ఈ విధంగా సెలవిస్తున్నారు:
أَنَّهُ إِذَا قَالَ الْمُعَلِّمُ لِلصَّبِیِّ قُلْ بِسْمِ اللَّهِ الرَّحْمنِ الرَّحِیمِ فَقَالَ الصَّبِیُّ بِسْمِ اللَّهِ الرَّحْمنِ الرَّحِیمِ کَتَبَ اللَّهُ بَرَاءَةً لِلصَّبِیِّ وَ بَرَاءَةً لِأَبَوَیْهِ وَ بَرَاءَةً لِلْمُعَلِّمِ
"గురువు తన సిష్యునికి "బిస్మిల్లా హిర్రహ్మాన్ నిర్రహీం" చెప్పటానికి ఆజ్ఞాపించినప్పుడు ఆ పిల్లవాడు బిస్మిల్లాహ్ చెప్పిన ప్రతీసారి ఆతడి తల్లితండ్రులకు మరియు ఈ గురువునకు నరకం నుండి విముక్తి కలగబడునని (తన కర్మల చిట్టాలో) వ్రాయబడును"
వేరొక హదీసులో మహప్రవక్త[స.అ.వ]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు:
"لَا یُرَدُّ دُعَاءٌ أَوَّلُهُ بِسْمِ اللَّهِ الرَّحْمنِ الرَّحِیمِ"
"ఏ దువా అయితే బిస్మిల్లాహ్ తో ఆరభించబడుతుందో అది తిరస్కరించబడదు"
వేరే చోట ఈ విధంగా ఉల్లేఖించారు:
"و قَرَأتَ بِسمِ اللّهِ تَحفَظُكَ الْمَلائِكَةُ إلَى الْجَنَّةِ و هُوَ شِفاءٌ مِن كُلِّ داءٍ"
"నువ్వు ఒక సారి బిస్మిల్లాహ్ హిర్రహ్మాన్ నిర్రహీం పఠించినట్లైతే దేవదూతలు నిన్ను స్వర్గం వరకు సమ్రక్షిస్తారు మరియు అన్ని రోగాములకు అది(బిస్మిల్లహ్) రోగరహితి"
మరియు హదీసులలో చాలా చోట్ల ప్రతీ పనికి ముందు బిస్మిల్లాహ్ చెప్పటానికి ఆజ్ఞాపించడం జరిగింది ముఖ్యంగా భోజనం ఆరగించే ముందు,మీ ప్రయాణానికి ముందు,ఏదైన ఆపద కలిగినప్పుడు,వుజూ చేసే సమయంలో..ఈ విధంగా వేరే చాల చోట్ల బిస్మిల్లాహ్ చెప్పటానికి గల ప్రాముఖ్యతను వివరించడం జరిగింది.
మీ  పనులను కేవలం ఆ సర్వేశ్వరుడైన అల్లాహ్ పెరుతో మొదలుపెట్టండి ఎందుకంటే మీరు ఎవరి పేరుతో మీ పనులను ఆరంభించినా వారు శాస్వతం కారు,కానీ ఆ అల్లహ్ పేరు శాస్వతం.

రెఫరెన్స్:
మజ్మూఅతో వరాం, వరాం బిన్ అబి ఫిరాస్,1వ భాగం, పేజీ నం:32.
ముస్తద్రకుల్ వసయెల్, 4వ భాగం, పేజీ నం:386, 387, 389.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15