హజ్రత్ అబూబక్ర్ ఖిలాఫత్ పరిశీలన-2

శుక్ర, 11/11/2022 - 03:50

అప్పుడు మదీనహ్ లో ఉన్న సహాబీయులందరూ హజ్రత్ అబూబక్ర్ ఖిలాఫత్ ను సమ్మతించారా? అన్న విషయం పై కొన్ని నిదర్శనలు...

హజ్రత్ అబూబక్ర్ ఖిలాఫత్ పరిశీలన-2

 

అప్పుడు మదీనహ్ లో ఉన్న సహాబీయులందరూ హజ్రత్ అబూబక్ర్ ఖిలాఫత్ ను సమ్మతించారా?

హజ్రత్ అబూబక్ర్ ఖిలాఫత్ వ్యతిరేకత గురించి హజ్రత్ ఉమర్ ఇలా వివరించారు: “అన్సాసులందరూ మమ్మల్ని వ్యతిరేకించారు, సఖీఫయె బనీ సాయిదహ్ లో కలిసికట్టుగా వచ్చారు వారితో పాటు అలీ, జుబైర్ మరియు వారితో ఉన్నవారందరూ మమ్మల్ని వ్యతిరేకించారు”.[1]

అబూబక్ర్(ర.అ) ఖిలాఫత్ పై వ్యతిరేకత గురించి ఇబ్నె తైమియహ్ ఇలా అనెను: “బనీ అబ్దె మనాఫ్, బనీ ఉమయ్యహ్, బనీ హాషిమ్ మరియు ఇతర సమూహాలకు చెందిన చాలా మంది అలీ ఇబ్నె అబీ తాలిబ్ యొక్క ఖిలాఫత్ ను అంగీకరించడానికి చాలా ఇష్టపడ్డారు.”[2]

అబూబక్ర్(ర.అ) ఖిలాఫత్ పై వ్యతిరేకత గురించి అహ్లెసున్నత్ వర్గానికి చెందిన ప్రముఖ ముహద్దిస్ ఇబ్నె అసీర్ ఇలా అనెను: “అన్సారులందరూ లేదా వారిలో కొంతమంది ‘మేము అలీను తప్ప ఎవ్వరితో బైఅత్ చేయము” అన్నారు.[3]

సహీ బుఖారీలో హజ్రత్ ఆయిషహ్ వారి ఉల్లేఖనం ప్రకారం: “దైవప్రవక్త(స.అ) మరణానంతరం హజ్రత్ ఫాతెమా(స.అ) ఆరు నెలలు జీవించారు... అలీ ఆ కాలంలో అబూబక్ర్ తో బైఅత్ చేయలేదు.”[4]
హజ్రత్ అలీ(అ.స) లేని ఇజ్మా కూడా ఒక ఇజ్మానా.....!!!

అహ్లె సున్నత్ వర్గానికి చెందిన ఇబ్నె హజ్మె ఉన్దులుసీ తన గ్రంథం అల్ ముహల్లాహ్ లో హజ్రత్ అలీ(అ.స) వ్యతిరేకంచే వాటిలో ఇజ్మా సృష్టించినవాడు అల్లాహ్ లఅనత్ కు గురి అవుతాడు, అని వివరించారు.[5]

అబూబక్ర్ నిలబడి నమాజ్ చదివారు మరియు దైవప్రవక్త కూర్చోని. అబూబక్ర్ దైవప్రవక్త(స.అ)ను అనుసరించారు, అదే సమయంలో ప్రజలు అబూబక్ర్ ను అనుసరించారు.[6]
ఈ రివాయత్ అబూబక్ర్ యొక్క ఖిలాఫత్ ను నిరూపిస్తూందా...!!

హజ్రత్ అబూబక్ర్ ప్రజలకు వినబడేలా గట్టిగా తక్బీర్(అల్లాహు అక్బర్) చెప్పేవారు.[7]
దైవప్రవక్త(స.అ) తమ జీవితకాలంలో ఎవరినైనా ఇమామె జమాఅత్ గా నిర్థారించారా...!!?

సమాధానం కోసం చూడండి సుననె అబీదావూద్, హదీస్595; దైవప్రవక్త(స.అ) ఇబ్నె ఉమ్మె మక్తూమ్ ను ఇమామె జమాఅత్ గా నిశ్చయించారు.[8]

దైవప్రవక్త(స.అ) స్థానంలో ఎవరైనా ఇమామె జమాఅత్ గా నిర్థారించబడడం, అతడి ఖిలాఫత్ పై నిదర్శనం అయితే మరి ఎందుకని అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమ్మె మక్తూమ్ ఖలీఫా అవ్వలేదు!!?.

దైవప్రవక్త(స.అ) అబ్దుల్ రహ్మాన్ ఇబ్నె ఔఫ్ వెనక నమాజ్ చదివారు అని ఇబ్నె అబీ షైబా తన గ్రంథగం ముసన్నఫ్ లో సూచించారు.[9]

అబ్దుల్లాహ్ ఇబ్నెఉమ్మె మక్తూమ్ మరియు అబ్దుల్ రహ్మాన్ ఇబ్నె ఔఫ్ ఇమామె జమాఅత్ గురించి వివరిస్తున్ హదీసుల ద్వార తెలిసే విషమేమిటంటే ఇమామె జమాఅత్ కు ఖిలాఫత్ అధికారానికి ఎటువంటి సంబంధం లేదు వీళ్ళిద్దరు కూడా ఖలీఫాలు అవ్వాలి.

అందరు తెలుసుకోవలసిన విషయంమేమిటంటే దైవప్రవక్త(స.అ) దావతే జుల్ అషీరా సంఘట నుండి గదీర్ సంఘటన వరకు ప్రతీ సందర్భంలో తన ఉత్తరాధికారి హజ్రత్ అలీ(అ.స) అని ప్రకటిస్తూ వచ్చారు. ఎన్నో ఆయతులు దైవప్రవక్త(స.అ) ఈ మాటను సమ్మతిస్తున్నాయి. ఎన్నో రివాయతులు, హదీసులు దీనికి సంబంధించి ఉల్లేఖించబడి ఉన్నాయి. ఉలమాలు వివేకపరంగా ఎన్నో ఆధారాలను కూడా ప్రదర్శించారు. ఈ విషయం పై ఎన్నో గ్రంథాలు రచించబడ్డాయి. ఈ విశేషం పై ఎన్నో జ్ఞాన సభలు జరిగాయి మరియు జరుగుతూనే ఉన్నాయి అయినా సరే కొందరికి ఏమాత్రం అర్థం కాదు. మరి కొందరు ఏమాత్రం అర్థం చేసుకోవాలనుకోరు. ఇప్పటికీ మించి పోయింది లేదు. ఇప్పుడు పరిశోధన చాలా సులభమయ్యింది. నిజానికి ఈ అంశం పై ఏదో జ్ఞాన పరమైన సాక్ష్యాలు అవసరం లేదు ఒక్క నిదర్శనం చాలు; అదేమిటంటే ప్రిన్సిపాల్ పని మీద వేరే ఊరు లేదా ఎక్కడికైనా వెళ్లేటప్పుడు తన చోటు ఎవరినైనా నిర్థారించి వెళతాడా లేకా ఆ సీటు ఖాళీగా ఉంచి వెళతాడా!? స్వయంగా మన ఉదాహారణే తీసుకుందా మేము దూర ప్రయాణానికి వెళ్లూ ఇంటిని చూసుకోమని ఎవరినైనా(భార్య, పెద్ద కొడుకు, బామ్మర్ధి మొ...) చెప్పి వెళ్తామా లేదా!?

మరి దైవప్రవక్త(స.అ) తన ఉత్తరాధికారిని నియమించకుండా ఇంత పెద్ద ఇస్లాం కుటుంబాన్ని వదిలి పెట్టి ఉమ్మతీయులను తమ నాయకుడ్ని ఎన్నుకోమని ఎలా వెళ్ళిపోతారు....!?

పడుకొన్నవాడ్ని లేపగలం కాని పడుకొన్నట్లు నటించేవారిని లేపడం చాలా కష్టం, కష్టం కాదు అసంభవం...

రిఫరెన్స్
1. సహీ బుఖారీ, భాగం8, పేజీ1690, హదీస్6830.
2. మిన్హాజ్ అల్ సున్నహ్, ఇబ్నె తైమియహ్, భాగం3, పేజీ47.
3. అల్ కామిల్ ఫిత్తారీఖ్, ఇబ్నె అసీర్, భాగం2, పేజీ189; తారీఖ్ అల్ తబరీ, భాగం2, పేజీ443.
4. సహీ బుఖారీ, భాగం5, పేజీ82, హదీస్4240, 4241.
5. అల్ ముహల్లాహ్, ఇబ్నె హజ్మ్, భాగం9, పేజీ345.
6. సహీబుఖారీ, భాగం1, పేజీ174, హదీస్713.
7. బుఖారీ, భాగం1, పేజీ174, హదీస్712.
8. సుననె అబీదావూద్, హదీస్595.
9. ముసన్నఫె ఇబ్నె అబీ షైబా, భాగం2, పేజీ119, హదీస్7170.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12