నిజమైన ఉపవాస దీక్షలు

మంగళ, 04/11/2023 - 12:32

నిజమైన ఉపవాసుల ప్రత్యేకతలు ఏమిటి? అన్న ప్రశ్నకు ఖుర్ఆన్ మరియు రివాయతులనుసారం సమాధానం...

నిజమైన ఉపవాస దీక్షలు

నిజమైన ఉపవాసుల ప్రత్యేకతలు ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం ఖుర్ఆన్ మరియు రివాయతుల ప్రకారం తెలుసుకుందాం:
ధర్మనిష్ఠ మరియు తఖ్వా:
ఖుర్ఆన్ యొక్క ఆయతులను పరిశీలిస్తే ఉపవాసం యొక్క కారణాలలో ఒకటి ధర్మనిష్ఠ అని తెలుస్తుంది. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: “ఓ విశ్వాసులారా! ఉపవాసాలుండటం మీపై విధిగా నిర్ణయించబడింది... దీనివల్ల మీలో భయభక్తులు పెంపొందే అవకాశం ఉంది”[బఖరహ్:183].
అల్లాహ్ ఈ ఆయత్ లో ఉపవాసం దీక్ష విధిగా నిర్ధారించబడినది అని ఆదేశించిన వెంటనే దీని యొక్క ఫీలసఫీ మానవుని శిక్షణ అని చిన్న వాక్యంతో వివరించేను; ఆ వాక్యం “ల అల్లకుమ్ తత్తఖూన్; దీనివల్ల మీలో భయభక్తులు పెంపొందే అవకాశం ఉంది” నిజంగానే ఉపవాస దీక్షలు మనిషి యొక్క ఆత్మను శిక్షణ ఇస్తుంది, పరిస్థితులను ఎదురుకునే బలాన్ని ఇస్తుంది...[1]
రివయత్ గ్రంథాలలో కూడా దీని గురించి వివరించబడి ఉంది: ఇమామ్ అలీ(అ.స) దైవప్రవక్త(స.అ)తో ఇలా ప్రశ్నించారు: “ఓ దైవప్రవక్త(స.అ) ఈ మాసంలో అత్యుత్తమ చర్య ఏమిటి? దైవప్రవక్త(స.అ) ఇలా సమాధానం ఇచ్చారు: “ఓ అబుల్ హసన్! అల్లాహ్ తరపు నుండి నిషేధించబడ్డ (హరామ్) చర్యల నుండి దూరంగా ఉండం, ఈ మాసంలో అత్యుత్తమ చర్య”[2] ఈ హదీస్ ద్వార తెలిసే విషయం నిజమైన ఉపవాసి యొక్క ప్రత్యేకత ధర్మనిష్ట ను కలిగి వుండడం లేదా దాన్ని పొందడానికి ప్రయత్నించడం.
శరీరమంతా ఉపవాసం ఉండడం:
ఉపవాసం అంటే కేవలం అన్నపానియాలకు దూరంగా ఉండడం కాదు. నిజమైన ఉపవాసం అంటే పూర్తి శరీరం అన్ని విధాలుగా ఉపవాసాన్ని పాటించాలి; అంటే ఎటువంటి చెడును చేయకూడదు. ఉపవాసంతో ఉండి చాడీలు చెప్పేవాడు, పాపముల నుంచి దూరం కానివాడు నిజమైన ఉపవాసి కాలేడు. రివాయత్ ఇలా ఉల్లేఖిస్తుంది: “ఉపవాస దీక్షను నిర్వర్తిస్తున్నప్పుడు నీ చెవులు కూడా ఉపవాసం ఉండాలి(అంటే వాటితో జరిగే పాపములకు దూరంగా ఉండాలి) నీ కళ్ళు కూడా ఉపవాసం ఉండాలి, నీ తల వెంట్రుకలు కూడా ఉపవాసం ఉండాలి చివరికి నీ శరీర చర్మం కూడా ఉపవాసం ఉండాలి”[3]

రిఫరెన్స్
1. తఫ్సీరె నమూనహ్, భాగం1, పేజీ624.
2. ఉయూను అఖ్బార్ అల్ రిజా(అ.స), భాగం1, పేజీ297.
3. అల్ కాఫీ(తా-అల్ ఇస్లామియహ్), భాగం4, పేజీ87.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18