దైవప్రవక్త[స.అ] భార్య

శని, 11/03/2018 - 11:54

దైవప్రవక్త[స.అ] భార్య అయిన జనాబె ఖదీజా[స.అ]గురించి ఆయిషహ్ ఉల్లేనం ద్వార సంక్షిప్త వివరణ.

దైవప్రవక్త[స.అ] భార్య

జనాబె ఖదీజా[అ.స] దైవప్రవక్త[స.అ] యొక్క మొదటి భార్య. దైవప్రవక్త[స.అ] 25 సంవత్సరముల వయసులో ఆమెతో వివాహం చేసుకున్నారు. ఆమె గురించి స్వయంగా దైవప్రవక్త[స.అ] మాటల్లో చెప్పాలంటే వారి యొక్క అతి మంచి భార్య, ఆమె తన పూర్తి ధనాన్ని మరియు సౌకర్యాలను ఇస్లాం ప్రచారం దైవప్రవక్త[స.అ]కు అప్పగించి వారితో ఇష్టంగా జీవితాన్ని గడిపారు, వారికి ఆమెతో ఎటువంటి కష్టం కలగలేదు. జనాబె ఖదీజా[అ.స] బేసత్ యొక్క 10వ సంవత్సరంలో మరణించారు. ఆమె బ్రతికున్నంతకాలం దైవప్రవక్త[అ.స] మరో వివాహం చేసుకోలేదు. ఈమె మరియు మారియహ్ ఖిబ్తియహ్ ద్వారానే తండ్రి అయ్యారు. అజ్ఞానపు కాలంలో జనాబె ఖదీజా[అ.స]ను “తాహిరహ్” అని సంభోదించేవారు. మరి దైవప్రవక్త[స.అ] ఆమెకు “కుబ్రా” అని బిరుదునిచ్చారు.
ఆయిషహ్ ఉల్లేఖనం: “దైవప్రవక్త[స.అ] ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఖదీజాను గుర్తుచేసేవారు, వారి మంచిని చెప్పేవారు. ఒకరోజు నాకు కడుపుమంట భరించలేక “ఆమె ఒక ముసలావిడ తప్ప మరేది కాదు1. అల్లాహ్ ఆమెకు బదులుగా ఆమెకు మించిది ప్రసాదించాడు” దైవప్రవక్త[స.అ]కు కోపం వచ్చింది, ఆ కోపంతో వారి తల వెంట్రుకలు కదులుతున్నాయి, అప్పుడు దైవప్రవక్త[స.అ] ఇలా అన్నారు: “కాదు, అల్లాహ్ సాక్షిగా! ఆమెకు మించిన దానిని నాకివ్వలేదు. ప్రజలు నన్ను విశ్వసించనప్పుడు ఆమె నా పై విశ్వాసం కలిగి ఉంది; ప్రజలు నన్ను నమ్మని సమయంలో నన్ను నమ్మింది; ప్రజలు నన్ను ఒంటరివాడిని చేసినప్పుడు తన సొంత సొమ్ముతో నన్ను సహకరించింది, నాకు తోడుగా నిలిచింది;....”
ఆయిషా ఇలా అన్నారు: ఆ తరువాత ఇక ఎన్నడూ ఖదీజా గురించి అగౌరవంగా చెప్పను అని ప్రమాణం చేసుకున్నాను.[షీవయే హంసర్దారీయె పయంబర్, పేజీ84].

రిఫ్రెన్స్
అహ్మద్ ఆబెదీనీ, షీవయే హంసర్దారీయె పయంబర్, తహ్రాన్, హస్తీ నుమా, చాపె దువ్వుమ్, 1382.   

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10