మనిషి హృదయము కఠినంగా మారటానికి గల కొన్ని కారణాలు మాసుమూల హదీసుల అనుసారంగా.
1. మాట తప్పడం: చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోకుండా వాటిని భంగపరచటం, హృదయాన్ని కఠోరంగా మార్చేస్తుంది. అల్లాహ్ పవిత్ర ఖురానులో ఈ విధంగా సెలవిస్తున్నాడు: “ఆ తరువాత వారు తమ వాగ్దానాన్ని భంగపరచిన కారణంగా మేము వారిని శపించాము.వారి హృదయాలను కఠినం చేసాము”[అల్ మాయిదా/13].
2. అధిక సంపద: ఇమాం సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించారు: “ఎక్కువ సంపదను కలిగి ఉండటం ధర్మము నాశనమవటానికి మరియు హృదయం కఠినంగా మారటానికి కారణమవుతుంది”[తొహ్ఫుల్ ఉఖూల్,పేజీ నం:199].
3. వ్యర్ధ సంభాషణ: ఎటువంటి లాభము లేని సంభాషణ కూడా కఠోర హృదయానికి ఒక కారణం అని చెప్పవచ్చు. ఇమాం అలి[అ.స] ఇలా ప్రవచించారు: “ఎటువంటి లాభము లేని సంభాషణకు మరియు శత్రుత్వానికి దూరంగా ఉండు ఎందుకంటే అవి హృదయం చెడిపోవటానికి కారణమవుతాయి”[అల్ కాఫి,2వ భాగం,పేజీ నం:300].
4. అతిగా నవ్వటం: దైవప్రవక్త[స.అ] ఇమాం అలి[అ.స]తో ఇలా ప్రస్తావించారు: “జాగ్రత్త! అతిగా నవ్వకు, ఎందుకంటే అతిగా నవ్వటం హృదయాన్ని మృత్యువుకు గురి చేస్తుంది”[అమాలియే షైఖ్ తూసి,పేజీ నం:541].
వ్యాఖ్యలు
Masha Allah
Jazakallah
Goog sentence
వ్యాఖ్యానించండి