ఆది, 05/05/2019 - 17:22
బహ్లూల్ కు తన భగవంతునిపై గల విశ్వాసాన్ని వివరించే ఒక చిన్న్న సంఘటన.
ఒకరోజు హరూన్ రషీద్, బహ్లూల్ తో నేను ఈ రోజు నీ జీతాన్ని నిర్ధేశించాలని అనుకుంటున్నాను దానితో నీవు పడే బాధలన్నీ తొలగిపోతాయి అని అన్నాడు. దానికి బహ్లూల్ నువ్వు చెప్పినది బాగానే ఉంది కానీ దానిలో మూడు పొరపాట్లున్నాయి. ఒకటి, నాకు ఏ వస్తువు యొక్క అవసరం ఉన్నదో నీకు తెలియదు, రెండు నాకు ఆ వస్తువు అవసరం ఎప్పుడుందో కూడా నీకు తెలియదు, మూడు నాకు ఆ వస్తువు యొక్క అవసరం ఎంత ఉందో కూడా నీకు తెలియదు. కానీ నా భగవంతునికి ఈ అన్ని విషయాలు తెలుసు. మరో విషయమేమిటంటే నేను ఏదైనా తప్పు చేస్తే నువ్వు నా జీతాన్ని నిలిపివేస్తావు. కానీ నా ప్రభువు ఎప్పుడూ తన దాసులు ఎన్ని పాపాలు చేసినా వారి జీవనాధారాన్ని నిలిపివేయడు అని అన్నారు.
రెఫరెన్స్: జంగె జవాన్,అక్బరి మహ్మూద్,పేజీ నం:139.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి