ఎప్పటికీ నక్షత్రాలు మరియు సూర్యచంద్రులూ నా ప్రభువులు కాలేరు అని తన నిదర్శనాన్ని వ్యక్తం చేసిన ప్రవక్త ఇబ్రాహీమ్[అ.స] పలుకులు ఖుర్ఆన్ లో
ఇబ్రాహీమ్[అ.స] పై రాత్రి చీకటి అలుముకున్నప్పుడు, అతను ఒక నక్షత్రాన్ని చూసి, “ఇతనే నా ప్రభువు” అన్నాడు. కాని అది అస్తమించగనే, “అస్తమించే వాటిని నేను అభిమానించను” అని చెప్పాడు. మరి అతను ప్రకాశిస్తున్న చంద్రుణ్ణి చూసి, “ఇతను నా ప్రభువు” అన్నాడు. కాని అది కూడా అస్తమించటంతో “ఒకవేళ నా ప్రభువు గనక నాకు మార్గదర్శకత్వం వహించకపోతే నేను మార్గవిహీన జనుల్లో చేరిపోతాను” అని పలికాడు. ఆ తరువాత సూర్యుణ్ణి ప్రకాశిస్తుండగా చూసి, “ఇతనే నా ప్రభువు. ఇతను అందరికన్నా పెద్దవాడు” అని పలికాడు. కాని అది కూడా అస్తమించేసరికి అతనిలా అన్నాడు: “ఓ నా జాతి వారలారా! మీరు (దైవానికి) కల్పించే భాగస్వామ్యాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు”. నేను ఆకాశాలను, భూమిని సృష్టించినవాని వైపుకు ఏకాగ్రతతో నా ముఖాన్ని త్రిప్పుకుంటున్నాను. నేను షిర్క్ చేసేవారిలోని వాణ్ణి కాను. [అన్ఆమ్:76-79]
వ్యాఖ్యానించండి