షైతాన్ ఉపదేశం

బుధ, 06/19/2019 - 14:49

షైతాన్ హజ్రత్ యహ్యా[అ.స]కు చేసిన ఉపదేశం సంగతిని వివరించిన ఇమామ్ సాదిఖ్[అ.స] హదీస్.

షైతాన్ ఉపదేశం

ఇమామ్ సాదిఖ్[అ.స] “హఫ్స్ ఇబ్నె గియాస్” కోసం ఒక కథనాన్ని ఇలా వివరించారు: ఒకరోజు ఇబ్లీస్, ప్రవక్త యహ్యా[అ.స] వద్దకు వచ్చాడు, అతడి మెడలో ఎన్నో త్రాళ్ళు ఉన్నాయి. ప్రవక్త యహ్యా[అ.స] అతడితో “ఈ త్రాళ్ళేమిటీ?” అని ప్రశ్నించారు.
ఇబ్లీస్: ఇవి ఆదమ్ సంతానం(మానవుల) యొక్క మనోవాంఛలు, వాటి ద్వార నేను వాళ్ళను బంధిస్తూ ఉంటాను.
ప్రవక్త యహ్యా[అ.స]: ఈ త్రాళ్లలో నాకు చెందినది కూడా ఉందా?
ఇబ్లీస్: కొన్ని సమయాలలో కడుపు నిండుగా తినటం వల్ల నీవు నమాజ్ మరియు అల్లాహ్ స్మరణ పట్ల పరధ్యానులయ్యావు.
ప్రవక్త యహ్యా[అ.స]: అల్లాహ్ సాక్షిగా! ఇప్పటి నుండి ఎప్పుడు కూడా కడుపు నిండుగా తినను.
ఇబ్లీస్: అల్లాహ్ సాక్షిగా! ఇక నుంచి నేను కూడా ఏ విశ్వాసిని ఉపదేశించను.
ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] చివరిలో ఇలా అన్నారు: హఫ్స్! అల్లాహ్ సాక్షిగా, జాఫర్ మరియు జాఫర్ సంతానం పై ఇది తప్పని సరి; వారు ఎప్పుడు కూడా తమ కడువును ఆహరంతో నింపుకోకూడదు.[సిరాతె సులూక్, పేజీ41] 

రిఫ్రెన్స్
అలీ మొహీతీ, సిరాతె సులూక్, ఖాయిమె ఆలే ముహమ్మద్ అ.స, 1392ష.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 25