.ఖుర్ఆన్ యొక్క 19వ సూరహ్ పేరు హజ్రత్ ఇమ్రాన్ కమర్తె మరియు దైవప్రవక్త అయిన హజ్రత్ ఈసా(అ.స) యొక్క తల్లి పేరున పెట్టబడింది.

ఖుర్ఆన్ యొక్క 19వ సూరా ఇది. “మర్యమ్” హజ్రత్ ఇమ్రాన్ కమర్తె మరియు దైవప్రవక్త అయిన హజ్రత్ ఈసా(అ.స) యొక్క తల్లి పేరు. ఈ సురాకు సంబంధించిన ఆయత్ ఈ సూరాలోని 16వ ఆయత్. ఈ సూరాలో “మర్యమ్” అను పదం 3 సార్లు మరియు పూర్తి ఖుర్ఆన్ లో 34 సార్లు వచ్చింది. ఈ సూరాలో 98 ఆయత్ లు, 970 పదాలు మరియు 3935 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరాలో “అల్లాహ్” పదం 8 సార్లు వచ్చింది. ఈ సూరా మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “ఫాతిర్” సూరా మరియు దీని తరువాత “తాహా” సూరా అవతరించబడ్డాయి. దీని పేరు “మర్యమ్” అని పెట్టడానికి కారణం ఇందులో జనాబె మర్యమ్ సంఘన ప్రస్తవన ఉండడం. పూర్తి ఖర్ఆన్ లో ఒక స్ర్తీ పేరుతో ఉన్న సూరహ్ ఇదే. ఇమామె జాఫరె సాదిఖ్[అ.స] వచనానుసారం ఎవరైతే “మర్యమ్” సూరహ్ ను ఎల్లప్పుడూ పఠిస్తారో వారు ఈ లోకాన్ని విడవరు ధనవంతుడవ్వనంత వరకు. మరియు వారి ధనం మరియు సంతానం పొందుతారు. పరలోకంలో హజ్రత్ ఈసా(అ.స) అనుచరుల నుండి లెక్కించబడతారు.
వ్యాఖ్యానించండి