రివాయతుల ప్రకారం ఇమామె ౙమాన్[అ.స] సహాబీయుల యొక్క కొన్ని ప్రత్యేకతల వివరణ...
రివాయతుల ప్రకారం ఇమామె ౙమాన్[అ.స] సహాబీయుల యొక్క కొన్ని ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి:
1. స్వచ్ఛత: ఇమామ్ జవాద్[అ.స] అబ్దుల్ అజీమె హసనీ[అ.స]తో ఇలా అన్నారు: “....స్వచ్ఛమైన వ్యక్తులు సంఖ్య 313కు చేరగానే అల్లాహ్ తన ఆజ్ఞను వ్యక్తం చేస్తాడు”
2. గట్టినమ్మకం మరియు స్థిరత్వం: ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఉల్లేఖనం: “.... వారి హృదయాలు ఇనుము ముక్కల లాంటివి, వారి హృదయాలలో అల్లాహ్ పట్ల ఎటువంటి సందేహమూ లేదు. రాళ్ల కన్నా బలమైనది...”
3. అల్లాహ్ ను అర్ధం చేసుకున్న నిజమైన విశ్వాసులు: ఇమామ్ అలీ[అ.స] ఉల్లేఖనం: “.... విశ్వాసులు వస్తారు, వారు అల్లాహ్ ను సరైన పద్ధతిలో అర్ధం చేసుకొని ఉంటారు, వారే చివరి కాలంలో ఇమామె ౙమాన్[అ.స] యొక్క సహాయకులై ఉంటారు”
4. పగల పులులు రాత్రి యోగులు: “ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఉల్లేఖనం: “నేను ఖాయమ్ మరియు వారి సహాబీయులను నజఫ్ కూఫాలలో ఇలా చూస్తూన్నట్లుంది... వారి నొసలపై సజ్దాల నిషానీలు ఉన్నాయి, పగటిపూట పులులులా మరియు రాత్రుళ్లు యోగులు.....”
5. అల్లాహ్ సమ్మతి కలిగి ఉన్నవారు: తబర్సీ ఇమామ్ అలీ[అ.స] నుండి రివాయత్ ను ఇలా ఉల్లేఖించారు: “.... అల్లాహ్ చివరి కాలంలో ఒకరిని ఎన్నుకునేంత వరకు... వారిని దైవదూతలు సమ్మతిస్తారు వారి సహాయకులను రక్షణ కలిపిస్తారు”[మౌఊద్ షినాసి వ పాసుఖ్ బె షుబ్హాత్, పేజీ599]
రిఫ్రెన్స్
అలీ అస్గర్ రిజ్వానీ, మౌఊద్ షినాసి వ పాసుఖ్ బె షుబ్హాత్, ఇంతెషారాతె మస్జిదె జమ్కరాన్, 1384.
వ్యాఖ్యానించండి