.“తాహా” సూరహ్ పఠనాన్ని వదలకండి ఎందుకంటే అల్లాహ్ తాహా సూరహ్ ను ఇష్టపడతాడు మరియు దానిని పఠించేవారిని కూడా ఇష్టపడతాడు.
ఖుర్ఆన్ యొక్క 20వ సూరా ఇది. “తాహా” దైవప్రవక్త ముహమ్మద్[స.అ] యొక్క బిరుదు. ఈ సురాకు సంబంధించిన ఆయత్ ఈ సూరాలోని 1వ ఆయత్. ఈ సూరాలో “తాహా” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 1 సారి వచ్చింది. ఈ సూరాలో 135 ఆయత్ లు, 1353 పదాలు మరియు 5399 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరాలో “అల్లాహ్” పదం 6 సార్లు వచ్చింది. ఈ సూరా మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “మర్యమ్” సూరా మరియు దీని తరువాత “వాఖిఅహ్” సూరా అవతరించబడ్డాయి. ఈ సూరహ్ యొక్క మరో పేరు “కలీమ్”. దీని పేరు “తాహా” అని పెట్టడానికి కారణం "తాహా" అను పదం కేవలం ఈ సూరహ్ లోనే ఉండడం. ఇమామె జాఫరె సాదిఖ్[అ.స] వచనానుసారం “తాహా” సూరహ్ పఠనాన్ని వదలకండి ఎందుకంటే అల్లాహ్ తాహా సూరహ్ ను ఇష్టపడతాడు మరియు దానిని పఠించేవారిని కూడా ఇష్టపడతాడు. ఈ సూరహ్ ను పఠించేవారి ప్రవర్తనాపత్రం ప్రళయంనాడు వారి కుడి చేతిలో ఉంటుంది, వారికి ఎటువంటి విచారణ ఉండదు, వారు రాజి పడేంత పుణ్యం వారికి ఇవ్వబడుతుంది.
వ్యాఖ్యానించండి