ఇమామె ౙమాన్[అ.స] అధికార కాలం

శని, 06/29/2019 - 05:56

ఇమామె ౙమాన్[అ.స] అధికార కాలం ఎంత వరకు సాగుతొంది అన్న విషయం పై హదీసుల వివరణ...

ఇమామె ౙమాన్[అ.స] అధికార కాలం

ఇమామె ౙమాన్[అ.స] అధికారం ఎంత కాలం వరకు సాగుతుంది2. అన్న ప్రశ్నను పరిశీలించినట్లైతే, మనకు రెండు విధాల రివాయతులు కనిపిస్తాయి.
1. ఇమామె ౙమాన్[అ.స] అధికార కాలం పది లేక దాని కన్న తక్కువ (ఇది ఎక్కువగా అహ్లె సున్నత్ గ్రంథాలలో ఉన్న రివాయత్ల ప్రకారం)
2. ఇమామె ౙమాన్[అ.స] అధికార కాలం పది సంవత్సరాల కన్న ఎక్కువ
పది లేక దాని కన్న తక్కువ కాలాన్ని నిదర్శిస్తున్న రివాయత్లు:
1. అబూ దావూద్ ఉల్లేఖనం: దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించారు: “మహ్దీ మా నుండి... ఏడు సంవత్సరాలు అధికారం చేస్తారు”
2. తిర్మిజీ ఉల్లేఖనం: దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించారు: “నిస్సందేహంగా నా ఉమ్మత్ లో మహ్దీ ఉన్నారు.... వారి అధికార కాలం ఐదు లేక ఏడు లేక తొమ్మిది సంవత్సరాలు”
పది కన్న ఎక్కువ సంవత్సరాలను నిదర్శిస్తున్న రివాయత్లు:
1. దైవప్రవక్త ఉల్లేనం: “మహ్దీ నా సంతానం నుండి... ఇరవై సంవత్సరాలు అతని అధికార కాలం ఉంటుంది”
2. ఇమామ్ అలీ[అ.స] ఉల్లేఖనం: “మహ్దీ 30 లేదా 40 సంవత్సరాలు ప్రజల పై అధికార చేస్తారు”
3. ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స]తో ఇమామ్ మహ్దీ[అ.స] అధికారం ఎన్ని రోజులు ఉంటుంది అని ప్రశ్నించినప్పుడు వారు “19 సంవత్సరాలు” అని సమాధానమిచ్చారు.
4. ఇమామ్ సాదిఖ్[అ.స] ఉల్లేఖనం: మా ఖాయిమ్ యొక్క అధికారం 19 సంవత్సరాల కొన్ని నెలల వరకు సాగుతుంది”[మౌఊద్ షినాసి వ పాసుఖ్ బె షుబ్హాత్, పేజీ652]

రిఫ్రెన్స్
అలీ అస్గర్ రిజ్వానీ, మౌఊద్ షినాసి వ పాసుఖ్ బె షుబ్హాత్, ఇంతెషారాతె మస్జిదె జమ్కరాన్, 1384.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
15 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8