ఖియామత్ అనగ ప్రళయదినం, దాని గురించి సంక్షిప్త వివరణ..
ఖియామత్, మన దీన్ యొక్క ఐదవ మూల విశ్వాసం. ఖియామత్ పట్ల విశ్వసం విధి. దానిని వ్యతిరేకించడం ఇస్లాం నుండి భవిష్కరణకు కారణం. ఇంకా వివరంగా తెలుసుకోవాలనుకుంటే ఈ క్రింది సంభాషణను చదవండి..
1. ఖియామత్ అనగానేమి?
జ. ఖియామత్ దినం అనగా అంతిమ దినం ఆ రోజు మంచి పనులు చేసిన వారికి బహుమతులు ప్రసాదించబడే మరియు చెడు పనులు చేసినవారికి శిక్షించే రోజు
2. ఆ రోజు ఎప్పుడు సంభవిస్తుంది?
జ. ప్రపంచమంతా నాశనమైన తరువాత
3. ప్రపంచం నాశనమైన తరువాత ఏమౌతుంద?
జ. అల్లాహ్ మరలా అందరిని పునర్జన్మను ప్రసాదిస్తాడు మరియు వారి నుండి లెక్కతీసుకుంటాడు
4. లెక్కతీసుకోవడం అనగానేమి?
జ. మంచి మరియు చెడును చూసి దాని ప్రకారం సవాబ్ మరియు అజాబ్ ఇవ్వబడుతుంది
5. సవాబ్ మరియు అజాబ్ అనగానేమి?
జ. ప్రళయదినాన ఇవ్వబడే శిక్షను అజాబ్ అని మరియు అక్కడి పుణ్యాన్ని సవాబ్ అంటారు
రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే అవ్వల్.
వ్యాఖ్యానించండి