పదహారవ పాఠం: రోౙా

ఆది, 07/21/2019 - 03:56

రోౙా మరియు దాని యొక్క ప్రాముఖ్యత మరియు కొన్ని అహ్కాముల సంక్షిప్త వివరణ...

పదహారవ పాఠం: రోౙా

1. రోౙా అనగానేమి?
జ. ఉదయం అౙాన్ సమయం నుండి మగ్రిబ్ నమాజ్ వరకు అల్లాహ్ ఆదేశానుసారం అన్నపానియాల వంటివి తీసుకోకుండా ఉండటం
2. రోౙా ఎప్పుడు వాజిబ్ అవుతుంది?
జ. పవిత్ర రమౙాన్ మాసంలో
3. ప్రతీ మస్లిము తప్పకుండా ఉపవాసం ఉండాలా?
జ. ఔను కాని రోగం మరియు ప్రయాణంలో ఉంటే అప్పుడు ఉండకుండా తరువాత దాని ఖౙా ఉండాలి
4. రోౙా యొక్క ఉపయోగాలేమిటి?
జ. అల్లాహ్ సామిప్యం, పుణ్యం లభిస్తాయి. ఆరోగ్యం మరియు ధైర్యం పొందుతారు
5. రోౙా దీక్షను నిర్వర్తించని వారి పరిణామేమిటి?
జ. మరణించిన తరువాత నరకానికి వెళతారు. ఇక్కడే ప్రతీ నిర్వర్తించని ఉపవాసానికి బదులు 60 నుండి 61 ఉపవాసాలు ఉండాల్సి వస్తుంది
6. ఉపవాసాలు నిర్వర్తించని ప్రతీ వారు తప్పకుండా 60 ఉపవాసాలు ఉండాలా?
జ. అవసరం లేదు, రోగం లేదా ప్రయాణం వలన ఉపవాస దీక్ష నిర్వర్తించని వారు కేవలం ఒక ఉపవాసానికి బదులు ఒక ఉపవాసం మాత్రమే ఉండాలి
7. ఈద్ అనగానేమి?
జ. రమౙాన్ మాసం పూర్తయిన తరువాత మొదటి రోజు రమౙాన్ పండగ రోజు
8. ఆ రోజు ఏమి చేయాలి?
జ. రెండు రక్అత్లు నమాజ్ చదివి విశ్వాసులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియపరుచుకోవాలి

రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే అవ్వల్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
16 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6