పదిహేడవ పాఠం: హజ్

మంగళ, 07/23/2019 - 03:46

హజ్ అంటే ఏమిటి? ఎప్పుడు విధిగా నిర్ధారించబడుతుంది? అన్న కొన్ని అంశాల వివరణ సంక్షిప్తంగా...

పదిహేడవ పాఠం: హజ్

1. జనం హాజీ ఎప్పుడు అవుతారు?
జ. హజ్ చేయడం ద్వార
2. హజ్ అనగానేమి?
జ. అల్లాహ్ గృహం వద్ద చేయు ఒక ప్రత్యేక ఆరాధన పేరు
3. అల్లాహ్ గృహం ఎక్కడుంది?
జ. మక్కాలో
4. ఈ ఆరాధన ఎప్పుడు జరుగుతుంది?
జ. జిల్ హిజ్ మాసం 9/10/11/12 వ తేదీలలో
5. జనం హజ్ చేయడానికి ఎందుకు వెళతారు?
జ. అల్లాహ్ ఆదేశం. ఆయన గృహదర్శనం చాలా పుణ్యానికి కారణం మరియు ఈ ప్రపంచంలో చాలా గర్వకారణం
6. అల్లాహ్ యొక్క గృహం పేరేమిటి?
జ. కాబా
7. అందులో ఎవరు జన్మించారు?
జ. మొదటి ఇమామ్ హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స]
8. హజ్ ఎవరి పై విధిగా నిర్ధారించబడింది?
జ. మక్కా వరకు వెళ్ళడానికి సరిపడ ఖర్చు ఉండి ఎటువంటి ఆటంకం లేనివారు
9. హజ్ ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తి పై విధిగా నిర్ధారించబడిందా?
జ. పూర్తి జీవితంలో ఒకసారి వాజిబ్ ఆ తరువాత ముస్తహబ్

రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే అవ్వల్.‎

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 4