పంతొమ్మిదవ పాఠం: ఖుమ్స్

మంగళ, 07/23/2019 - 04:15

ఖుమ్స్ లో ఎన్ని భాగాలున్నాయి?, అది ఎవరిరెవరికి చెందుతాయి?, అవి ఎప్పుడు వాజిబ్ అవుతుంది? అన్న ప్రశ్నలకు సంక్షిప్త సమాధానాలు...

పంతొమ్మిదవ పాఠం: ఖుమ్స్

ఫురూయె దీన్ నుండి ఐదవది ఖుమ్స్. ఇది అహ్లెబైతె తాహెరీన్[అ.స]కు ప్రత్యేకించబడినది. ఇది ఇస్లాం ప్రచారం మరియు (సాదాత్) వారి వంశానికి చెందిన పేదవారికి సహాయంగా నిలుస్తుంది. దీనిని చెల్లించని వాడు ఒక దోషి మరియు ఇతరుల సొమ్మును దోచుకున్నవాడు అని అంటారు. ఖుమ్స్ గురించి తెసుకోవాడనికి ఈ సంభాషణ చదవండి:
1. దేనిని ఖుమ్స్ అంటారు?
జ. మన దగ్గర ఉన్న సొమ్ము నుండి ఐదవ భాగాన్ని ఖుమ్స్ అంటారు
2. ఖుమ్స్ ఎవరిపై విధిగా నిర్ధారించబడింది?
జ. ప్రతి ముస్లిం పై వాజిబ్ చేయబడింది
3. ఖుమ్స్ ఎన్నింటి పై వాజిబ్ చేయబడింది?
జ. వ్యాపారంలో మగిలిన సొమ్ము, మఅదన్, గంజ్, హలాల్ సొమ్ములో హరామ్ సొమ్ము కలిసిపోయినప్పుడు, సముద్రంలోతు నుండి తీసిన రత్నాలు, యుద్ధంలో దక్కిన సొమ్ము(మాలె గనీమత్) మొదలగు వాటి నుండి ఖుమ్స్ చెల్లించడం తప్పని సరి.
4. ఖుమ్స్ ఎవరికి ఇవ్వాలి?
జ. ఖుమ్స్ సొమ్మును రెండు భాగాలుగా విడదీస్తారు, ఒక భాగం దైవప్రవక్త[స.అ] వంశానికి చెందిన పేదవారిది మరియు ఒక భాగం ఇమామ్[అ.స]ది
5. ఇమామ్ యొక్క భాగాన్ని ఎవరికి ఇవ్వాలి?
జ. ఇమామ్ యొక్క ప్రతినిధులైన ముజ్తహిద్ కు
6. ఇమామ్ యొక్క ప్రతినిధి ఆ సొమ్ములు ఏమి చేస్తాడు?
జ. ఇస్లాంకు చెందిన అన్ని పనులు చేస్తాడు. మద్రసాలను స్థాపిస్తాడు, ఇస్లాం ప్రచారన చేస్తాడు మరియు ఇస్లాం రక్షణకై ఖర్చు చేస్తాడు
7. ఎవరైన ఖుమ్స్ చెల్లించకపోతే ఏమౌతుంది?
జ. వాడిని ఇమామ్ యొక్క హక్కును తినేసినవాడు అని అంటారు. అతడు ఇమామ్ పట్ల నిజమైన స్నేహం కలిగిఉన్నవాడు మరియు విధేయుడు కాలేడు
8. ఇప్పటి వరకు ఖుమ్స్ గురించి ఏదీ తెలియని వాడు ఇప్పుడు ఏమి చేయాలి?
జ. తెలిసిన తరువాత ముజ్తహిద్ నుండి తెలుసుకొని ఆ సొమ్మును చెల్లించేయాలి మరియు మునుపటి నిర్లక్ష్యం పై  అల్లాహ్ ను క్షమాపణ కోరుతూ తౌబహ్ చేయాలి
రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే అవ్వల్.‎  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13