పశ్చాత్తాపం యొక్క ప్రయోజనాలు దివ్యఖురానులో.
1. ధనం, శక్తి పెరుగుతాయి: “ఓ నా జాతివారలారా! మీ పోషకుని (అంటే అల్లాహ్) సమక్షంలో మీ తప్పుల మన్నింపుకై ప్రార్థించండి. ఆయన సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. ఆయన మీపై (ఆకాశం నుండి) ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. మీకున్న బలిమికి మరింత శక్తినీ, బలాన్నీ చేకూరుస్తాడు. మీరు మాత్రం అపరాధులుగా తిరిగిపోకండి”[హూద్/52].
2. అల్లాహ్ ప్రేమకు, అతని దయకు అర్హులవుతారు: “మీరు క్షమాపణ కోసం మీ ప్రభువును వేడుకోండి. మరి ఆయన వైపుకే మరలండి. నిశ్చయంగా నా ప్రభువు అమిత దయా మయుడు, అపార ప్రేమమయుడు”.[హూద్/90].
3. అల్లాహ్ మీ ప్రార్ధనలను ఆమోదిస్తాడు: “ఆయనే మిమ్మల్ని భూమి నుండి పుట్టించి, అందులో మిమ్మల్ని వసింపజేశాడు. కాబట్టి మీరు మన్నింపు కోసం ఆయన్నే వేడుకోండి, ఆయన వైపుకే మరలండి (పశ్చాత్తాపం చెందండి). నిశ్చయంగా నా ప్రభువు చాలా సమీపంలో ఉన్నాడు. ఆయన ప్రార్థనలను ఆలకించి ఆమోదిస్తాడు’‘ అని చెప్పాడు.[హూద్/90].
వ్యాఖ్యానించండి