దైవప్రవక్త హదీసు అనుసారంగా హృదయాన్ని నాశనం చేసే నాలుగు లక్షణాలు.
మానవుడు చేసే ప్రతీ పనికి అతని హృదయంతో తప్పక సంబంధముంటుంది. ఎలాగంటే తనకు మంచి జరిగినప్పుడు హృదయపరంగానే సంతోషిస్తాడు అదేవిధంగా ఎదైన కష్టమొచ్చినప్పుడు హృదయ పరంగానే బాధపడతాడు.అలాంటి హృదయం నాశనమైపోతే ఏం జరుగుతుంది?నాశనమవ్వటానికి కారణాలెంటి?ఒక వెళ నాశనమైతే ఎలాంటి పరిణామాలను చూడవలసివస్తుంది? అన్న ప్రశ్నలు కలుగుతాయి.వీటికి జవాబుగా దైవప్రవక్త ముహమ్మద్[స.అ]ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: నాలుగు లక్షణాలు హృదయాన్ని నాశనం చేస్తాయి మరియు హృదయంలో కపటత్వాన్ని పెంచుతాయి. ఎలగైతే నీరు చెట్టు ఎదగతానికి తోడ్పడుతుందో అదేవిధంగా ఈ నాలుగు పనులు హృదయంలో కపటత్వాన్ని పెంచేలా చేస్తాయి:1.సంగీతాన్ని వినడం, 2.తప్పుడు మరియు అశ్లీలమైన మాటలు మాట్లాడటం, 3.రాజ దర్బారుకు వెళ్ళటం, 4.షికారు చేయటం.
రెఫరెన్స్
అల్ ఖిసాల్,2వ భాగం,పేజీ నం:227.
వ్యాఖ్యానించండి