శని, 08/03/2019 - 17:24
ఇమాం ముహమ్మద్ బాఖిర్[అ.స]ల వారు తన కుమారునితో ఈ విధంగా ఉల్లేఖించారు:
"భగవంతుడు మూడింటిని మూడింటిలో దాచి ఉంచాడు:
1.తన ఇష్టాన్ని[సంతోషాన్ని] తన ఆజ్ఞపాలనలో దాచి ఉంచాడు. ఎటువంటి ఆజ్ఞపాలననూ చిన్నదిగా చూడవద్దు, అల్లాహ్ ఇష్టం అందులోనే ఉన్నదేమో?.
2.తన కోపాన్ని పాపాలలో దాచి ఉంచాడు, ఎటువంటి పాపాన్ని చిన్నదిగా చూడవద్దు, అల్లాహ్ క్రోధం అందులోనే ఉన్నదేమో?.
3.తన స్నేహితులను ప్రజల మధ్యలో దాచి ఉంచాడు, ఎవరిని చిన్న చూపు చూడవద్దు[నువ్వు ఎవరినైతే చిన్నచూపు చూస్తావో] వారే అల్లాహ్ సాధువులై ఉండవచ్చు.
రెఫరెన్స్
బిహార్ అన్వార్,116వ భాగము,పేజీ నం:17.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి