మతం అనగానేమి మరియు ఇస్లాం మతం ద్వార మనకు అల్లాహ్ ఏమిటి తెలియపరచాలనుకుంటున్నాడు అన్న అంశాల పై సంక్షిప్త వివరణ.
ఒక పిల్లవాడు ఏదైనా వస్తువును చూస్తే అది మంచిదా కాదా అని తెలుసుకోకుండానే దాన్ని తీసుకోవడానికి పరుగులు తీస్తాడు, కాని అది మంచి వస్తువు కాకపోతే, ఆ వస్తువు పిల్లాడికి నచ్చినా సరే తల్లిదండ్రులు దాని నుండి ఆ పిల్లాడిని ఆపుతారు. అదే ఒకవేళ మంచి వస్తువు అయి ఉండి, ఆ వస్తువు పిల్లాడికి నచ్చకపోయినా తల్లిదండ్రులు దాన్ని ఆ పిల్లాడికి తీసుకొనేందుకు ఆదేశిస్తారు.
అలాగే అల్లాహ్ కూడా తన దాసుల కోసం మతం ద్వార మంచి మరియు చెడు ఆదేశాలను తెలియపరిచాడు, ఎందుకంటే దాసులకు అన్నింటి యొక్క మంచి మరియు చెడు తెలియదు. మతం మంచి గురించి చెబుతుంది మరియు చెడును తెలియపరుస్తుంది. మతం మంచి చేయమని ఆదేశిస్తుంది మరియు చెడు నుండి ఆపుతుంది.
రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే సివ్వుమ్.
వ్యాఖ్యానించండి