కనిపించని అల్లాహ్ ను ఎలా విశ్వసించాలి అన్న ప్రశ్నకు ఇమామ్ ఇచ్చిన సమాధానం...
ఒకరోజు హజ్రత్ జాఫరె సాదిఖ్[అ.స]తో ఒక నాస్తికుడు “మేము అల్లాహ్ ను చూడలేదు, మీరేమో అల్లాహ్ ను ఎవ్వరూ చూడలేరు అని అంటారు అయితే చూడకుండా అల్లాహ్ ఉన్నాడు అని ఎలా నమ్మాలి?” అని ప్రశ్నించాడు.
ఇమామ్[అ.స] “నువ్వు ఎప్పుడైనా సముద్ర ప్రయాణం చేశావా?” అని ప్రశ్నించారు. అవును, చేశాను అని అతనన్నాడు. ఇమామ్ “ఎప్పుడైనా నువ్వు ప్రయాణిస్తున్న షిప్ తుఫాను వచ్చి విరిగి మునిగిపోయే సందర్భరం వచ్చిందా?” అని అడిగారు. ఔను, అలా కూడా జరిగింది అని అన్నాడు. ఇమామ్ “నీ షిప్పు మునిగిపోతుండగా నువ్వు మరణిస్తావు అని నీకు నమ్మకం కలిగిన తరువాత కూడా నీ మనసు “ఇప్పుడు కూడా ఎవరో రక్షించగలడు” అని చెప్పిందా లేదా?” ఔను, నిస్సందేహంగా చెప్పింది అని అతనన్నాడు. ఇమామ్ “నిరాశ చెందిన తరువాత కూడా నీవు ఆశ పెట్టుకున్నవాడెవడు, నువ్వు అతడిని చూశావా?” అని ప్రశ్నించారు. అతడు “చూడలేదు కాని హృదయం ఏదో చూడని దానిని ఆశ్రయించింది” అని అన్నాడు. ఇమామ్ “నిరాశ స్థితిలో మనసును ఆశనిచ్చే అస్తిత్వం పేరే అల్లాహ్” అని అన్నారు.
కష్టాలలో ఇరుక్కు పోయినా సరే నిరాశకు గురి కాకుండా నిరంతరం అల్లాహ్ కారుణ్యాన్ని ఆశ్రయించు వాడే నిజమైన విశ్వాసి.
రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే సివ్వుమ్.
వ్యాఖ్యానించండి