అపవిత్రాలకు సంబంధించిన కొన్ని అంశాలు

సోమ, 08/26/2019 - 16:54

పవిత్ర అపవిత్రాలకు సంబంధించిన కొన్ని అంశాల వివరణ...

అపవిత్రాలకు సంబంధించిన కొన్ని అంశాలు

పాలు, పెరుగు, నెయ్యి, ఆలీవ్ నూనె అలాగే వేరే విధమైనవి గట్టి పడిపోతే, వాటిలో నజాసత్ పడిపోతే, ఆ పడిన కొంత భాగమే అపవిత్రమైనది మిగిలినదంతా పవిత్రమైనదే. కాని ఒకవేళ ఆ పదార్థం ద్రవం అయి ఉంటే దేనిలో అయితె పడిందో అదంతా నజిస్ అవుతుంది.
ఆ పదార్థం గట్టి పడిందా లేదా ద్రవమేనా అని ఎలా తెలుసుకోవాలంటే, అందులో నుండి ఒక చెంచాడు పదార్థాన్ని తీయాలి, ఆ తీయబడిన స్థానం వెంటనే నిండితే అది ద్రవ పదార్థమని భావించాలి. మరి ఆ స్థానం నిందకపోతే లేదా చాలా సమయం తరువాత నిండితే ఘన పదార్థమని, కేవలం ఆ నజాసత్ పడిన చోటు మరియు చుట్టూ కొంత భాగాన్ని అపవిత్రంగా భావించాలి. మిగిలిందంతా పవిత్రమైనదిగానే భావించాలి.
నజిస్ వాటిని తినటం త్రాగటం హరామ్ గా నిర్ధారించబడి ఉంది, అంతే కాదు వేరే వారికి నజిస్ ను తినిపించటం కూడా హరామ్ గా నిర్ధారించబడి ఉంది.
ఖుర్ఆన్ మజీద్, మస్జిద్, మస్జిద్ నేల, ప్రవక్తల మరియు ఇమాముల పవిత్ర దర్శనా కేంద్రాలను అపవిత్రం చేయటం హరామ్. ఒకవేళ ఈ ప్రదేశాలు అపవిత్రం గనక అయితే వాటిని వెంటనే శుభ్రపరచటం వాజిబ్ గా నిర్ధారించబడి ఉంది.  

రిఫ్రెన్స్
ఇమామియహ్ దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, కితాబె సివ్వుమ్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
14 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18