మృత్యువును గుర్తు చేసుకుంటూ ఉంటే కలిగే లాభాల వివరణ ఒక హదీస్ అనుసారం...

మృత్యువును నిరంతం అతిగా గుర్తు చేసుకుంటూ ఉండాలి అని చాలా తాకీదు చేయబడి ఉంది. తద్వార చాలా లాభాలున్నాయి అని వివరించబడి ఉంది. వాటిలో రెండు ముఖ్యమైనవి ఏమిటంటే; మృత్యువును నిరంతరం స్మరించే మరియు గుర్తుపెట్టుకునే మనిషి ఇహపరలోకాలలో సాఫల్యం పొందుతాడు.
ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] మృత్యువు స్మరణ యొక్క లాభాల గురించి ఇలా వివరించెను: “మృత్యువు స్మరణ మనోవాంఛలను అంతం చేస్తుంది, పరధ్యానాన్ని వేర్ల నుండి పీకి పడేస్తుంది, అల్లాహ్ చేసిన ప్రమాణం వల్ల హృదయానికి శక్తిని ప్రసాదిస్తుంది, మనిషి ప్రవర్తనలో సున్నితాన్ని తీసుకొస్తుంది, అత్యాశను విరిచేస్తుంది, పేరాస మంటను ఆర్పేస్తుంది మరియు ప్రపంచాన్ని అతడి దృష్టికి అల్పమైనదిగా చేసి చూపిస్తుంది”.[బిహారుల్ అన్వార్, భాగం6, పేజీ133]
ఈ హదీస్ మనకు కేవలం మృత్యువును గుర్తు పెట్టుకుంటే మన ఇహలోకాలు సాఫల్యమౌతాయి అని చెబుతుంది.
రిఫ్రెన్స్
మజ్లిసీ, దారు అహ్యాయి అల్ తురాస్ అల్ అరబీ, బీరూత్, 1403ఖ.
వ్యాఖ్యానించండి