ఇమాం హుసైన్[అ.స] ల వారి రాయబారైన ముస్లిం ఇబ్నె అఖీల్ గురించి సంక్షిప్తంగా.
ముస్లిం ఇబ్నె అఖీల్ ఇబ్నె అబీతాలిబ్,ఇమాం హుసైన్[అ.స] ల వారి బాబాయి ఆయిన అఖీల్ కుమారుడు మరియు కూఫా పట్టణంలో ఇమాం హుసైన్[అ.స] ల వారి రాయబారి మరియు అబూతాలిబ్ వంశస్థులు.వారు ఇమాం హుసైన్[అ.స] ల వారి ఆజ్ఞానుసారం కూఫా పట్టణానికి వారి రాయబారిగా వెళ్ళి అచ్చటి పరిస్థితులను ఇమాం హుసైన్[అ.స] ల వారికి తెలియపరుచుటకు బయలుదేరారు.ఒకవేళ కూఫా వాసులు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటే ఇమాం హుసైన్[అ.స] ల వారు అచటకు రావచ్చునని,ఒక వేళ అక్కడ పరిస్థుతులు అనుకున్న దానికి వ్యతిరేకంగా ఉంటే ఇమాం ల వారిని తిరిగి వెనక్కి వెళ్ళే సందేశాన్ని పంపవచ్చని అనుకున్నారు.కూఫా చేరుకున్న అఖీల్ కూఫా వాసులు ఇమాం హుసైన్[అ.స] ల వారితో ఉన్నారని ఇమాం ల వారు రావచ్చునని సందేశాన్ని పంపారు.ఉమర్ బిన్ సాద్ మరియు మొహమ్మద్ బిన్ అష్ అసె కింది ల పిర్యాదు మెరకు ఉబైదల్లాహ్ బిన్ జియాద్ కూఫా చేరుకున్నాడు.ఎవరైతే అమవీ ఖలీఫాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే ఆలోచనలో ఉన్నారో, వారిని వారి వంశాన్ని నాశనం చేస్తానని బెదిరించాడు.అత్యంత క్రూరుడైన ఉబైదల్లహ్ కు భయపడి కూఫా వాసులు ముస్లిం బిన్ అఖీల్ ను ఒంటరిగా వదిలేయటం జరిగింది.పరదేశంలో గుర్తుతెలియని వ్యక్తుల మధ్య ఒంటరిగా మిగిలిపోయారు.కానీ భయపడకుండా ఉబైదల్లాహ్ సైన్యంతో విరోచితంగా పోరాడారు.చివరకు ఉబైదుల్లహ్ సైన్యం వారిని మొసంగా పన్నాగాన్ని పన్ని ఖైదు చేసి ఉబైదల్లాహ్ ముందు ప్రవేశపెట్టారు.బుకైర్ బిన్ హమ్రాన్ వారిని రాజభవనం పైకి తీసుకెళ్ళి వారి శిరస్సును వధించి వారి దేహాన్ని రాజభవనం పైనుండి క్రిందికి పడవేయటం జరిగింది.ఈ విధంగా ముస్లిం బిన్ అఖీల్ ల వారు శత్రువుల చేతిలో వధించబడినా,ఇమాం హుసైన్[అ.స] ల వారి నమ్మకస్తునిగా మరియు యజీద్ అన్యాయాలను వ్యతిరేకించి వారితో పోరాడిన యోధునిగా చరిత్రలో మిగిలిపోయారు.వారి సమాధి ఇరాక్ దేశంలో గల కూఫా పట్టణంలో మస్జిదే కూఫా వద్ద ఉన్నది.
రెఫరెన్స్: తబరి,తారీఖుల్ ఉమం వల్ ములూక్,5వ భాగము,పేజీ నం:355,మఖ్తలె జామయె సయ్యిదుష్ షొహదా,1వ భాగము,పేజీ నం:512.
వ్యాఖ్యానించండి