దేవుని అజ్ఞలను సక్రమంగ పాటించడం మరియు దేవుని ద్వారా నిషేదించబడిన వాటి జోలికి పోకుండా ఉండటాన్నే తఖ్వా అంటారు.
అపార కరుణామయుడు,పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరిట
ఒక రోజు ఒకవ్యక్తి ఇమాం సాదిఖ్[అ.స]ల వారి సమక్షంలో నాకు ఒక మంచి ఉపదేసాన్ని ప్రస్తావించమని విన్నపించుకున్నాడు,దానికి ఇమాం స్పందిస్తూ ఈ విధంగా సెలవిచ్చారు:
التقوی لَا یَفْقِدُكَ اللَّهُ حَیْثُ أَمَرَكَ وَ لَا یَرَاكَ حَیْثُ نَهَاكَ (بحارالانوار)
అనువాదం: తఖ్వా(ధర్మనిష్ఠ) అనగా ఎక్కడైతే అల్లాహ్ ఆజ్ఞలు ఉన్నాయో అక్కడ నువ్వు మాయమవ్వకు(పారిపోకు) మరియు ఎక్కడైతే దేవుని యొక్క నిషేదాజ్ఞలు ఉన్నయో అక్కడ నువ్వు ప్రత్యక్షం అవ్వకు(హాజరవ్వకు).
ఈ హదీసులో ఇమాం చెప్పదలుచుకుందేమిటంటే మనిషి తన కర్తవ్యాలను(దేవుని ఆజ్ఞలను) సక్రమంగ పాటించాలి మరియు దేవుని ద్వారా నిషేదించబడిన వాటి జోలికి పోకూడదు, ఏ చోటైతే దేవుడు ఒక పని గురించి ఆజ్ఞాపిస్తాడో మీరు దానిని విడవకూడదు మరియు మీరు షైతాన్ యొక్క ప్రలొభాలకు మరియు మోసాలకు బానిస కాకుండా నీతిమంతమైన జీవితం గడపవలసి ఉంటుంది.[బిహరుల్ అన్వార్, సంపుటి:70,పేజీ నం:285]
రిఫరెన్స్
బిహరుల్ అన్వార్, అల్లామా మజ్లిసీ, సంపుటి:70,పేజీ నం:285.
వ్యాఖ్యానించండి