జొహైర్ ఇబ్నె ఖైన్

గురు, 09/05/2019 - 10:21

ఉస్మానీ తెగకు చెంది వారైన జొహైర్ ఇబ్నె ఖైన్ ఏ విధంగా ఇమాం హుసైన్[అ.స] ల వారిని కలుసుకుని ఇస్లాం సం రక్షణ కొరకు తన ప్రాణాలను అర్పించారో ఈ క్రింది వ్యాసంలో సంక్షిప్తంగా వివరించడం జరిగింది.

జొహైర్ ఇబ్నె ఖైన్,కర్బలా,ఇమాం హుసైన్.

జొహైర్ ఇబ్నె ఖైనె బజలి కర్బలా అమరవీరులలో ఒకరు వారు బజలి వంశానికి పెద్ద కూడా.వారు ఇమాం హుసైన్[అ.స] ల వారితో కలిసే ముందు ఉస్మానీ సమూహానికి చెందేవారు.కానీ ఇమాం హుసైన్[అ.స] ల వారికి దగ్గరయిన తరువాత ఇమాం హుసైన్[అ.స] ల వారి ద్వారా పొందిన స్పూర్తితో వారు కర్బలా లో ఇస్లాం సం రక్షణ కొరకు తన ప్రాణాలను అర్పించారు.60వ హిజ్రిలో జొహైర్ తన భార్య మరియు తన వంశస్తులతో హజ్ నుండి కూఫా తిరిగి వస్తుండగా దారిలో ఇమాం హుసైన్[అ.స] ల వారి సమూహానికి కొంత దూరంలో బస చేశారు.ఇమాం హుసైన్[అ.స] ల వారు జొహైర్ ను కలవాలని సందేశాన్ని పంపారు.సందేశాన్ని అందుకున్న జొహైర్ ముందుగా వారిని కలవడానికి ఆసక్తిని చూపలేదు కానీ తన భార్య సలహాతో ఇమాం[అ.స] ల వారిని కలవడానికి వెళ్ళారు.ఈ కలయిక జొహైర్ జీవితాన్నే మార్చేసింది. ఇమాం ల వారిని కలిసి వచ్చిన జొహైర్ తన తమ డేరాలను ఇమాం హుసైన్[అ.స] ల వారి డేరాలకు దగ్గరగా వేయాలని ఆజ్ఞాపించారు.ఈ విధంగా ఇమాం హుసైన్[అ.స] ఇస్లాం సం రక్షణ కొరకు మరియు యజీద్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని తెలుసుకున్న జొహైర్, ఇమాం హుసైన్[అ.స] ల వారితో కర్బలా వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. కర్బలా చేరుకున్న జొహైర్ అషూరా రోజున జొహర్ యొక్క నమాజు చేస్తున్న ఇమాం హుసైన్[అ.స] మరియు వారి అనుచరులను సం రక్షిస్తూ తన ప్రాణాలను కోల్పోయారు.జొహైర్ మరణం తరువాత వారి గురించి ఇమాం హుసైన్[అ.స] ల వారు  “ఓ జొహైర్! నిన్ను ఆ భగవంతుడు తన కృపకు దూరం చెయకూడదు గాక!నిన్ను చంపిన వారిపై ఆ దేవుని శాపము కలుగు గాక!మరియు నీ హంతకులపై బని ఇస్రాఈల్ ల వారి వలె నిత్యం వారిపై ఆ అల్లాహ్ శాపము కలుగు గాక”అని అన్నారు. 

రెఫరెన్స్: మఖ్తలుల్ హుసైన్,ఖ్వారజ్మి,2వ భాగము,పేజీ నం:20,23.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
20 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 2