. దైవప్రవక్త[స.అ] యొక్క రాత్రి పూట ఎక్కవ సమయం నమాజ్, దుఆ మరియు ప్రార్ధనలలో గడిచేది.
దైవప్రవక్త[స.అ] యొక్క రాత్రి పూట ఎక్కవ సమయం నమాజ్, దుఆ మరియు ప్రార్ధనలలో గడిచేది. దైవప్రవక్త[స.అ] నమాజ్ పద్దతి ఎలా ఉండేదంటే ఒంటరిగా ఉంటే నమాజ్ ను చాలా నెమ్మదిగా చాలా ఎక్కువ సమయంలో చదివేవారు వారు ఒక్కోసారి వారి నమాజ్ లో ఎక్కువగా నిలబడడం వల్ల వారి పాదాలు ఉబ్బిపోయేవి. ఇది ఇలా ఉన్నప్పటికీ వారు జమాఅత్ నమాజ్ ను చదివించేటప్పుడు నమాజీయులను దృష్టిలో ఉంచుకొని చాలా తక్కువ సమయంలో నమాజ్ ను చదివించేవారు.
దైవప్రవక్త[స.అ] తనకు నమాజ్ మరియు ప్రార్ధన పట్ల ఉన్న ప్రేమ గురించి అబూజర్ తో ఇలా అన్నారు: “ఓ అబూజర్! అల్లాహ్ నా కళ్ళ కాంతిని నమాజ్ లో ఉంచి దానిని నాకు ఇష్టమైనదిగా నిర్ధారించాడు ఏలాగై ఆకలితో ఉన్న వాడికి అన్నం పై మరియు దప్పికగలవాడికి నీరు ఇష్టమైనదో అలాగ. ఆకలితో ఉన్న వాడు భోజనం చేసి మరియు దప్పికతో ఉన్న వాడు నీరు త్రాగి కడుపు నింపుకుంటాడు కాని నాకు, నేను ఎంత నమాజు చదివినా ఇంకా చదవాలి అనే ఉంటుంది”.
వ్యాఖ్యలు
Subhanallah
Shukriya....
Mashallah
Shukriya....
వ్యాఖ్యానించండి