ఉత్తమ సహాబీయులు

సోమ, 09/30/2019 - 16:19

సహాబీయులలో అహ్లెబైత్[స.అ]లే ఉత్తములు, జ్ఞానులు, పవిత్రులు మరియు నాయకత్వానికి అర్హులు అని నిదర్సిస్తున్న కొన్ని ఆయతులు....

ఇతకు ముందు చెప్పబడిన మూడు రకాల సహాబియులే కాకుండా ఇంకో రకం సహాబియులు కూడా ఉన్నారు. వాళ్ళు దైవప్రవక్త[స.అ] సహవాసమే కాకుండా వారితో ఆత్మీయ మరియు దైహిక ప్రత్యేక ప్రతిష్ట కలిగివున్నవారు. వాళ్ళకు అల్లాహ్ మరియు దైవప్రవక్త[స.అ], వేరే ఎవ్వరూ చేరలేనటువంటి విశిష్టతలను ప్రసాదించారు. వాళ్ళనే అహ్లెబైత్[అ.స] అంటారు. అల్లాహ్ వీళ్ళ నుండే అపవిత్రతను దూరంగా ఉంచి సంపూర్ణ పవిత్రులు నిర్ధారించెను[అహ్జాబ్:33].
దైవప్రవక్త[స.అ] పై దురూద్ పంపడం మాదిరిగా వాళ్ళపై కూడా దురూద్ పంపడం వాజిబ్ చేయబడింది. వాళ్ళ కోసమే ఖుమ్స్ లో ఒక భాగాన్ని కేటాయించబడింది[అన్ఫాల్:41]. వాళ్ళ పట్ల ప్రేమను దైవప్రవక్త[స.అ] యొక్క దౌత్యానికి ప్రతిఫలముగా నియమించి ముస్లిములందరి పై వాజిబ్ చేయబడింది[షూరా:23]. ఎవరి పట్ల విధేయత చూపటం విధిగా నిర్ధారించబడ్డారో ఆ ఉలుల్ అమ్ర్ (నాయకుల్)వీళ్ళే[నిసా:59]. ఖుర్ఆన్ వ్యాఖ్యా తెలిసిన వారు, దాని ధృడత్వం మరియు అనురూపాలు తెలిసిన పరిపక్వ జ్ఞానం కలిగిన వారూ, వీళ్ళే[ఆలి ఇమ్రాన్:7].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17