హుదైబియహ్ సంఘటన సహాబీయుల అసభ్య ప్రవర్తనకు నిదర్శనం

బుధ, 10/02/2019 - 15:52

హుదైబియహ్ సంఘటన సహాబీయుల అసభ్య ప్రవర్తనకు ఎలా నిదర్శనం అన్న విషయం సంక్షిప్తంగా...

హుదైబియహ్ సంఘటన సహాబీయుల అసభ్య ప్రవర్తనకు నిదర్శనం

ఇంతకు ముందు హుదైబియహ్ సంధి సమయంలో ఎవరు దైవప్రవక్త[స.అ]ను నిలదీసి ప్రశ్నించారు మరి అలాగే సహాబీయులు దైవప్రవక్త[స.అ] ఆజ్ఞను పాటించలేదు అన్న విషయాలు తెలుసుకున్నారు. దీనిపై షియా, సున్నీ ఇరువర్గాల వారు ఏకాభిప్రాయము కలిగి ఉన్నారు. చరిత్రకారులు ఉదాహరణకి తబరీ, ఇబ్నె అసీర్, ఇబ్నె సఅద్ మొదలగు వారు అలాగే “బుఖారీ” మరియు “ముస్లిం” కూడా వ్రాశారు.
సహాబీయులు దైవప్రవక్త[స.అ] ముందు ఇలాంటి అసభ్య ప్రవర్తన చేస్తున్నారంటే ఈ సహాబీయులు ఎలాంటివారైవుంటారో ఆలోచించండి!!!. ఈ సంఘటన తరువాత ప్రపంచలో బుధ్ధిమంతుడెవరైనా సహాబీయులు, దైవప్రవక్త[స.అ] ఆజ్ఞను పాటించడానికి మనసా వాచా అమలు చేయడానికి సిద్ధంగా ఉండేవారని నమ్ముతారా?. హుదైబియహ్ సంధి రోజు జరిగిన సంఘటన సహాబీయులను నిరాకరిస్తుంది. వాళ్ళ అసత్యపు ప్రమాణాలను బయట పెడుతుంది. దైవప్రవక్త[స.అ] ముందు ఇలాంటి అసభ్య ప్రవర్తన, మామూలు విషయమా!? లేదా ఇలా తెగించిన వారు క్షమార్హూలా!? లేదా వాళ్ళ తెగింపు అంగీకరింపదగినదా!? అనే విషయాలను బుధ్ధిమంతుడు గ్రహించగలడు.
అల్లాహ్ ఇలా ప్రవచించెను: “కాదు, ముహమ్మద్! నీ ప్రభువు సాక్షిగా! వారు తమ పరస్పర విభేదాల విషయంలో నిన్ను న్యాయనిర్ణేతగా స్వీకరించనంతవరకు, ఇంకా నీవు ఏ నిర్ణయం చేసినా దానిని గురించి వారి మనస్సులలో కూడా ఏమాత్రం సంకోచం లేకుండా దానిని యథాతథంగా శిరసావహించనంతవరకు వారు నిజమైన విశ్వాసులు కాలేరు”[నిసా:65]

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6