దైవప్రవక్త[స.అ] పై ఉమర్ నమ్మకం

బుధ, 10/02/2019 - 16:18

దివ్యఖుర్ఆన్ యొక్క నిసా సూరహ్ ఆయత్ 65 ఆదారంగా హుదైబియహ్ సంధి సమయంలో ఉమర్ ప్రవర్తన పై సంక్షిప్త వివరణ....

దైవప్రవక్త[స.అ] పై ఉమర్ నమ్మకం

ఖుర్ఆన్ ప్రవచనం: “కాదు, ముహమ్మద్! నీ ప్రభువు సాక్షిగా! వారు తమ పరస్పర విభేదాల విషయంలో నిన్ను న్యాయనిర్ణేతగా స్వీకరించనంతవరకు, ఇంకా నీవు ఏ నిర్ణయం చేసినా దానిని గురించి వారి మనస్సులలో కూడా ఏమాత్రం సంకోచం లేకుండా దానిని యథాతథంగా శిరసావహించనంతవరకు వారు నిజమైన విశ్వాసులు కాలేరు”[నిసా:65]
ఈ ఆయత్ ప్రకారం ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ హుదైబియహ్ సంధి సమయంలో దైవప్రవక్త[స.అ] నిర్ణయానికి శిరసావహించారా?. దైవప్రవక్త[స.అ] తీర్పుపై మనసు సంకోచింపలేదా?. లేక దైవప్రవక్త[స.అ] నిర్ణయంలో వారికి అనుమానం కలగలేదా?. ముఖ్యంగా ఇలా అనడం “మీరు నిజమైన దైవప్రవక్త[స.అ] కారా?”. అతి త్వరలో మేము కాబాకు వెళ్ళి ప్రదక్షణాలు చేద్దామని మాతో మీరు చెప్పేవారు కాదా?..., దైవప్రవక్త[స.అ] ఇచ్చిన జవాబులను ఉమర్ అంగీకరించారా? ఒకవేళ అంగీకరించి ఉంటే అవే ప్రశ్నలు అబూబక్ర్ వద్దకు వెళ్ళి అడిగి ఉండేవారు కాదు. ఆ తరువాత అబూబక్ర్ జవాబులతో తృప్తి పొందారా?. దైవప్రవక్త[స.అ] మరియు అబూబక్ర్‌ల జవాబుతో సంతృప్తి పొందినట్లైవుంటే “నేను దాని కోసం చాలా పన్నాగాలు పన్నాను” అని ఎందుకు చెప్పినట్లు. ఉమర్ పన్నిన ఆ పన్నాగాలేమిటో ఆ అల్లాహ్ మరియు దైవప్రవక్త[స.అ]కే తెలియాలి. అంతేకాకుండా మిగిలిన వాళ్ళు ఎందుకు ఆజ్ఞను ఆచరించలేదు? దైవప్రవక్త[స.అ] మూడేసి సార్లు “మీరు లేచి బలిచ్చి తల వెంట్రుకలు తీయించుకోండి” అని ఆదేశించినప్పటికీ ఏ ఒక్కరు అమలు చేయలేదు.
వీటన్నింటి ద్వార తెలిసే విషయమేమిటంటే సహాబీయులందరూ నమ్మదగినవారు కాదు వారిలో కూడా మంచి వారు మరికొందరు కపటవర్తనులు, ఉండేవారు...

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11