ఇతరులను మన్నించటం

గురు, 10/03/2019 - 16:28

ఇతరులను మన్నించే విధానాన్ని తెలిపే ఇమాం సజ్జద్[అ.స] ల వారి ఒక సంఘటన.

ఇమాం సజ్జాద్,కోపం,మన్నించటం.

ఒకసారి ఇమాం సజ్జాద్[అ.స] ల వారి బంధువులలో ఒక వ్యక్తి అందరి సమక్షంలో ఇమాం సజ్జాద్[అ.స] ల వారితో చెడుగా సంభోదించి వెళ్ళిపోయాడు.ఇమాం ఇతరులతో “అతని మాటలను విన్నారా?ఇప్పుడు మీరు నాతో వచ్చి నా జవాబును కూడా వింటారని ఆశిస్తున్నాను” అన్నారు.దానికి వారు “మేము మీతో వస్తాము కానీ మీరు ఎప్పుడైతే ఆ వ్యక్తి మీతో చెడుగా మాట్లాడాడో అప్పుడే మనము సమాధానం ఇవ్వవలసింది” అని అన్నారు.ఇమాం ల వారు వారితో ఆ వ్యక్తి ఇంటివైపు వెళ్తూ ఖురాను యొక్క ఈ ఆయతును పఠించారు: “కోపాన్ని దిగమ్రింగుతారు.ప్రజల పట్ల మన్నిపు వైఖరిని అవలంబిస్తారు.అల్లాహ్ ఇలాంటి సదాచార సంపన్నులనే ప్రేమిస్తాడు” [ఆలె ఇమ్రాన్/134].ఇమాం ల వారితో ఉన్నవారు ఇమాం ల వారి గురించి వేరే విధంగా ఆలోచించారు.కానీ తరువాత వారికి తెలిసింది ఇమాం ల వారు ప్రతీకారం తీర్చుకొనుటకు వెళ్ళటం లేదని. ఆ వ్యక్తి ఇంటికి చేరుకున్న ఇమాం ల వారు అలి ఇబ్నుల్ హుసైన్[అ.స] వచ్చారని అతనితో చెప్పమని ఆజ్ఞాపించారు.ఇమాం సజ్జాద్[అ.స] ల వారు ప్రతీకారం కోసం వచ్చారని ఆ వ్యక్తి తనకు తాను ఇమాం తో గొడవపడటానికి సిధ్ధపడి బయటకు వచ్చాడు.అప్పుడు ఇమాం సజ్జాద్[అ.స] ల వారు  “సోదరా! నువ్వు కొంత సమయం క్రిందట నా వద్దకు వచ్చి ఇలా అన్నావు.కానీ నువ్వు ఏదైతే చెప్పావో అవి[ఆ లక్షణాలు] నాలో ఉంటే,ఆ దేవునిని నన్ను క్షమించమని కోరతాను.ఒక వేళ ఆ లక్షణాలు నాలో లేకపోతే ఆ దేవునిని నిన్ను క్షమించమని కోరతాను” అని అన్నారు. ఇమాం సజ్జాద్[అ.స] ల వారి నిర్మలమైన సంభాషణ ఆ వ్యక్తిని సిగ్గుపడేలా చేసింది.ముందుకు వచ్చి ఇమాం ల వారి నుదిటీని ముద్దాడి “నేను ఏదైతే మీ గురించి చెప్పానో అవి మీలో లేవు.ఏదైతే మీగురించి చెప్పానో దానికి నేను అర్హుడిని” అని అన్నాడు.

రెఫరెన్స్: ఇర్షాదె షైఖ్ ముఫీద్,పేజీ నం: 240.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15