గురువారం సంఘటన ఇబ్నె అబ్బాస్ కథనం ప్రకారం

శని, 10/05/2019 - 13:44

ఇబ్నె అబ్బాస్ ఇలా చెబుతూ వుండేవారు: “చాలా బాధా కరమైన విషయం ఏమిటంటే వాళ్ళ విరుద్ధం, అల్లకల్లోలం దైవప్రవక్త[స.అ]కు ఏమి వ్రాయనివ్వలేదు”

గురువారం సంఘటన ఇబ్నె అబ్బాస్ కథనం ప్రకారం

ఇబ్నెఅబ్బాస్ ఉల్లేఖనం: గురువారం నాడు దైవప్రవక్త[స.అ]కు వ్యథ ఎక్కువైయ్యింది. దైవప్రవక్త[స.అ], “మీకు రుజుమార్గం నుండి తప్పనివ్వకుండా కాపాడేందుకు మీ కోసం ఒక లేఖనం వ్రాస్తాను” అని అన్నారు. ఉమర్, “దైవప్రవక్త[స.అ] రోగము వ్యథలో ఒడలు తెలియక మాట్లాడుతున్నారు. మా వద్ద ఎలాగో ఖుర్ఆన్ ఉంది కదా, మాకు ఈ అల్లాహ్ గ్రంథమే చాలు (వేరేగా వ్రాసే అవసరం లేదు)” అని అన్నారు. ఈ మాటపై అక్కడున్న వాళ్ళలో విరుద్ధం ఏర్పడింది. తమలో తాము పోట్లాడుకున్నారు. అందులో కొందరు “(దైవప్రవక్త[స.అ]) తరువాత రుజుమార్గం నుండి తప్పకుండా వుండేందుకు వ్రాయాలని అనుకుంటున్న లేఖనాన్ని వ్రాసేందుకు దైవప్రవక్త[స.అ]కు కలం మరియు కాగితం ఇవ్వండి” అని అంటున్నారు, మరి కొందరు ఉమర్ చెప్పిన మాటను సమ్మతించారు. ఎప్పుడైతే దైవప్రవక్త[స.అ] సన్నిధిలో నువ్వానేనా అంటూ కోలాహలం ఎక్కువైయ్యిందో. దైవప్రవక్త[స.అ] “నా వద్ద నుండి వెళ్ళిపోండి” అని ఆదేశించారు.
ఇబ్నె అబ్బాస్ ఇలా చెబుతూ వుండేవారు: “చాలా బాధా కరమైన విషయం ఏమిటంటే వాళ్ళ విరుద్ధం, అల్లకల్లోలం దైవప్రవక్త[స.అ]కు ఏమి వ్రాయనివ్వలేదు” [సహీ బుఖారీ, భాగం2].

రిఫ్రెన్స్
సహీ బుఖారీ, భాగం2, బాబొ ఖొలిల్ మరీజ్, ఖూమూ అన్నీ.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19