దైవప్రవక్త[స.అ] సన్నిధిలో అల్లకల్లోలం

శని, 10/05/2019 - 14:45

ఓ విశ్వాసులారా! మీ కంఠస్వరాన్ని ప్రవక్త కంఠస్వరం కంటే పెంచకండి. మీరు పరస్పరం మాట్లాడుకునే విధంగా ప్రవక్తతో బిగ్గరగా మాట్లాడకండి...

దైవప్రవక్త[స.అ] సన్నిధిలో అల్లకల్లోలం

దైవప్రవక్త[స.అ]ను ఇస్లాం ఉమ్మత్ విముక్తి లేఖనాన్ని వ్రాయనివ్వకపోవడం; ఇది కేవలం ఉమర్‌కే సంబంధించింది అయ్యి ఉంటే పరవాలేదు కాని ఈ సమస్య అంత సాధారణమైనది కూడా కాదు. ఎందుకంటే ఒకవేళ అలానే అయ్యివుంటే దైవప్రవక్త[స.అ], ఉమర్‌ను “నేను అల్లాహ్ ఆజ్ఞలేనిదే మాట్లాడను” అని శ్రధ్ధ చెప్పి శాంత పరిచేవారు. హిజ్యాన్ ప్రస్తావనే వచ్చివుండేది కాదు. కాని ఇక్కడున్న సమస్యే వేరు. చాలా మంది అంతకు ముందు నుంచే సిధ్ధంగా ఉన్నారు. అందుకే ఉద్దేశ పూర్వకంగా దైవప్రవక్త[స.అ] సన్నిధిలో అల్లకల్లోలం సృష్టించారు. అల్లాహ్ ఆదేశాన్ని  మరిచో లేక మరిపించో ప్రవర్తించారు. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: “ఓ విశ్వాసులారా! మీ కంఠస్వరాన్ని ప్రవక్త కంఠస్వరం కంటే పెంచకండి. మీరు పరస్పరం మాట్లాడుకునే విధంగా ప్రవక్తతో బిగ్గరగా మాట్లాడకండి, దానివల్ల, బహుశ మీరు చేసినదంతా మీకు తెలియకుండానే వ్యర్ధమైపోవచ్చు ఆ సంగతి మీకు తెలియను కూడా తెలియకపోవచ్చు”[హుజురాత్:2]
ఈ సంఘటనలో కంఠస్వరం పెంచడమే కాకుండా దానితో పాటు (అల్లాహ్ క్షమించుగాక) దైవప్రవక్త[స.అ]పై హిజ్యాన్ నింద కూడా మోపబడింది. ఆ తరువాత ఎంత అల్లకల్లోలం జరిగిందంటే దైవప్రవక్త[స.అ] సన్నిధిలో నువ్వానేనా అను అసభ్య ప్రవర్తనకు దారి తీసింది.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14