దైవప్రవక్త ముహమ్మద్[అ.స]

ఆది, 12/03/2017 - 03:43

.అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త హజ్రత్ ముహమ్మద్[అ.స] గురించి సంక్షిప్త వివరణ.

దైవప్రవక్త ముహమ్మద్[అ.స]

అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త అయిన హజ్రత్ ముహమ్మద్ ఇబ్నె అబ్దుల్లాహ్ క్రీ.శ 570వ సంవత్సరంలో శుక్రవారం రోజు రబీవుల్ అవ్వల నెల 17వ తారీఖు, మక్కా పట్టణంలో జన్మించారు. నలభై ఏళ్ళప్పుడు అల్లాహ్ వారిని ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఇంచుమించు 13 సంవత్సరాలు మక్కాలోనే రహస్యంగా మరియు బహిరంగంగా పవిత్ర ఇస్లాం ప్రచారణ చేశారు. ఆ తరువాత మక్కాలో ఉన్న అవిశ్వాసుల మరియు ముష్రికుల ఒత్తిడి రోజురోజుకు పెరుగుతూ ఉండడం వల్ల వారు మక్కాను విడిచి మదీనహ్ పట్టణానికి వెళ్ళిపోయారు. అక్కడున్న 10 సంవత్సరాలలో పవిత్ర ఇస్లాం ప్రచారణ మరియు ఇస్లామీయ అధికారాన్ని స్థాపించిన తరువాత 63 సంవత్సరాల వయసులో సఫర్ నెల 28వ తారీఖున అల్లాహ్ ఆహ్వానాన్ని అంగీకరిస్తూ ఈ లోకాన్ని విడిచారు. వారి పవిత్ర సమాధి మదీనహ్ పట్టణంలో “మస్జిదున్నబీ” ప్రక్కన ఉంది. అది సంవత్సరం పొడుగున వారిని ఇష్టపడే వాళ్ళతో నిండి ఉంటుంది ముఖ్యంగా హజ్ దర్శనం కాలానికి ముందు మరియు తరువాత రోజుల్లో ప్రపంచం నలుమూలల నుండి జనం వారి సమాధి దర్శనానికి ఎగబడి వస్తారు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 4