అబూసుఫ్యాన్ మొదటి నుండే అవిశ్వాసుడు అని నిదర్శిస్తున్న అతడి ఉపన్యాసం...

అబూసుఫ్యాన్, మొదటి మరియు రెండవ ఖలీఫహ్ కాలంలో ఖిలాఫత్ అధికారాన్ని చేజిక్కించుకోవాలని నిరంతరం అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉండేవాడు. అతడు ఒక్కోసారి అభ్యతరం వ్యక్తం చేస్తే మరో సారి వాదనకి దిగేవాడు, కొన్ని సందర్భాలలో అయితే అసహ్యంగా కూడా ప్రవర్తించేవాడు... కాని అతడు ఎంత చేసినా అధికారం చేజిక్కించుకునే అవకాశం మాత్రం లభించలేదు. ఇస్లాం పేరున వేరే అధికారం అమలులోకి తీసుకొని రావాలనే ఆలోచనతో హిజాజ్(మదీనహ్) నుండి దూరంగా వేరే ప్రదేశానికి వెళ్ళాలని అనుకున్నాడు. దానికోసమని వివిధ సాకులతో రెండవ ఖలీఫాను షామ్ దేశానికి ముఆవియాను అధికారిగా పంపేందుకు కోరాడు, రెండవ ఖలీఫా షామ్ అధికారాన్ని ముఆవియహ్ కు ఇచ్చారు. అయితే ఇక అబూ సుఫ్యాన్ మనసులో భవిష్యత్తులో ఇస్లామీయ దేశంలో అభిప్రాయబేధం సృష్టించాలి అనే కోరికతో ఉండిపోయాడు.
రెండవ ఖలీఫహ్ మరణానంతరం ముందు నుండే పన్నిన్న యుక్తి ప్రకారం (ఆ పన్నాగంలో బనీ ఉమయ్యహ్ కూడా భాగస్వాములే) ప్రజలు ఉస్మాన్ ను ఖలీఫహ్ గా ఎన్నుకున్నారు. ఆ తరువాత అబూ సుఫ్యాన్ కు మరలా అధికారం పై ఆశ పుట్టుకొచ్చింది. అతడు తన బంధుమిత్రులను సంగ్రహించి ఉపన్యాసమిస్తూ ఇలా అన్నాడు: "ఖిలాఫత్ ను బంతిని ఆటగాళ్ళు దక్కించుకునే విధంగా దక్కించుకోండి, అబూసుఫ్యాన్ ఎవరి పై ప్రమాణం చేస్తాడో అతడి సాక్షిగా; శిక్షా లేదు లేక్కలూ లేవు, స్వర్గమూ లేదు నర్కమూ లేదు, మరణానంతరం మరలా లేపబడేదీ లేదూ ప్రళయమూ లేదు, మన కొట్లాట అధికారం మరియు పరిఫాలన పైనే, ఇప్పటి వరకు బనీ హషిమ్ వంశస్తులు అధికారం చేశారు, ఇక ఇప్పడు బనీ ఉమయ్యహ్ వంతు, ఇప్పుడు అధికారం బనీ ఉమయ్యహ్ చేతుల్లో వచ్చింది దీన్ని బలంగా పట్టుకొండి, అధికారాన్ని వంశపారంపర్యంగా మన వంశంలోనే మిగిలి ఉండిపోవాలి"[దర్ పర్తూయే ఆజరఖ్ష్, పేజీ18].
అబూసుఫ్యాన్ యొక్క ఈ మాటలు, అబూసుఫ్యాన్ మొదటి నుండే అవిశ్వాసుడు అని నిదర్శిస్తున్నాయి.
రిఫ్రెన్
మిస్బాహ్ యజ్దీ, దర్ పర్తూయే ఆజరఖ్ష్, ఖుమ్, మొఅస్ససయే ఆమూజిష్ వ ఫజోహిషె ఇమామ్ ఖుమైనీ(ర.అ),1381.
వ్యాఖ్యానించండి