దైవప్రవక్త[స.అ] చర్యపై అనుమానం

ఆది, 10/13/2019 - 06:12

దైవప్రవక్త[స.అ] చర్యపై అనుమానం వ్యక్తం చేసిన అన్సారులకు చెందిన ఒక సహాబీ సంఘటన సంక్షిప్తంగా...

దైవప్రవక్త[స.అ] చర్యపై అనుమానం

“బుఖారీ” తన గ్రంథం యొక్క నాలుగోవ భాగంలో 47 పేజీలో “బాబుస్సబ్ర్ అలల్ అజా” మరియు ఆయత్ “ఇన్నమా యువఫ్ఫిస్సాబిరూన్ అజ్రహుమ్” క్రమంలో అఅమష్ ప్రవచనను లిఖించారు: నేను షఖీఖ్‌ను ఇలా చెబుతుండగా చూశాను: అబ్దుల్లాహ్ ప్రవచన ప్రకారంగా, ఒకసారి దైవప్రవక్త[స.అ] కొంత సొమ్మును పంచబెట్టారు అయితే అన్సార్‌లలో నుండి ఒకడు “అల్లాహ్ సాక్షిగా (మీరు చేస్తున్న) ఈ కార్యంలో అల్లాహ్ దృష్టిలో లేడు (అనగ అన్యాయంగా పంచుతున్నారు)” అని అన్నాడు. నేను వెళ్ళి నీ ఈ మాటను దైవప్రవక్త[స.అ]కు వివరిస్తాను అని చెప్పి సహాబీయుల ముందు దైవప్రవక్త[స.అ]కు ఆ మాట చెప్పాను దాంతో దైవప్రవక్త[స.అ] ముఖము రంగు మరిపోయింది, వారి ముఖం పై కోపాన్ని చూసి నేను ఆ మాటను చెప్పకుండా వుంటే బాగుండేదనిపించింది.
ఆ తరువాత దైవప్రవక్త[స.అ] ఇలా అన్నారు: “మూసా[అ.స]ని ఇంతకన్న ఎక్కువ ఇబ్బంది పెట్టారు అయిన సరే అతను కూడా ఒర్పుగా ఉండేవారు”.[సహీ బుఖారీ, భాగం4, పేజీ47]

రిఫ్రెన్స్
బుఖారీ, సహీ బుఖారీ, బాబుస్ సబ్ర్ అలల్ అజా అనే అధ్యాయంలో.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9