అనుచరులతో సమానంగా

సోమ, 10/28/2019 - 16:07

మహాప్రవక్త[స.అ.వ] ల వారి సాదాతనాన్ని వివరించే ఒక సంఘటన.

దైవప్రవక్త[స.అ.వ] ల వారు తన అనుచరులతో ఒక ప్రయాణానికి వెళ్ళారు.దారి మధ్యలో ప్రవక్త[స.అ.వ] ల వారు ఒక గొర్రెను జిభ్హ్ చేసి[వధించి] భోజనాన్ని తయారు చేయమని ఆజ్ఞాపించారు.అనుచరులలో ఒక వ్యక్తి ఆ జిభ్హ్ చేసే పని నా వంతు అని అన్నాడు,రెండవ వ్యక్తి దాని తోలు తీయటం నా వంతు అని అన్నాడు,మూడవ వ్యక్తి ఆ మాంసాన్ని వండే పని నాది అని అన్నాడు.ప్రవక్త[స.అ.వ] ల వారు దానికి కావలసిన కట్టెలను తెచ్చే పని నాది అని అన్నారు.అప్పుడు అనుచరులు "ఓ దైవప్రవక్త!మా తల్లితండ్రులు మీపై ఫిదా అవ్వుగాక,మీరు ఈ పనిలో మిమ్మల్ని మీరు కష్టపెట్టకండి,మేము ఆ కట్టెలను తెచ్చుకుంటాము" అని అన్నారు. అప్పుడు దైవప్రవక్త[స.అ.వ] ల వారు "నాకు తెలుసు మీరు ఈ పనిని నాకోసం చేస్తారని కానీ నా భగవంతుడు ఎవరైతే తన అనుచరుల కన్నా తనను తాను గొప్పగా చూసుకుంటాడో అతనిని ఇష్టపడడు" అని చెప్పి వారి కోసం కట్టెలను తెచ్చిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు.

రెఫరెన్స్: మొహ్జతుల్ బైజా,4వ భాగం,పేజీ నం;61.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 25