అహ్లెసున్నత్ రివాయతుల ప్రకారం అలీ[అ.స]యే నాయకుడు

మంగళ, 11/12/2019 - 16:12

ఇమామ్ అలీ[అ.స] ఖిలాఫత్ పై అహ్లె సున్నత్ స్పష్టమైన రివాయత్ల నిదర్శనం...

అహ్లెసున్నత్ రివాయతుల ప్రకారం అలీ[అ.స]యే నాయకుడు

దైవప్రవక్త[స.అ] మరణానంతరం ఇమామత్ మరియు ఖిలాఫత్ పదవి కేవలం ఇమామ్ అలీ[అ.స]కే చెందుతుంది అని షియా ముస్లిములు నమ్ముతారు. గదీర్ రివాయతే కాకుండా అహ్లె సున్నత్ యొక్క హదీస్ మూల గ్రంథాలలో ఇమామ్ అలీ[అ.స] యొక్క ఉత్తరాధికారం పై స్పష్టమైన రివాయతులు ఉన్నాయి. ఇక్కడ “ముస్తద్రకె హాకిమ్” నుండి స్వయంగా అతనే సరైనవి అని తీర్మానించిన రెండు రివాయతులను వెల్లడిస్తున్నాము. ఇవి ఇమామ్ అలీ[అ.స] యొక్క ఇమామత్ మరియు ఖిలాఫత్ పదవి పై స్పష్టమైన సాక్ష్యాలు:
మొదటి రివాయత్: జాబిర్ ఇబ్నె అబ్దుల్లాహ్ ఇలా ఉల్లేఖించెను: దైవప్రవక్త[స.అ] అలీ భుజం పై చేయ్యివేసి పెద్దగా ఇలా అన్నారు: “ఇతను సజ్జనుల నాయకుడు, దుర్మార్గులను మరియు దుష్టులను హతమార్చేవాడు. ఇతనిని సహకరించినవాడు సాఫల్యం పొందుతాడు మరియు ఇతనిని అవమానించినవారు విఫలుడవుతాడు”[అల్ ముస్తద్రికు అలస్ సహీహైన్, భాగం3, పేజీ140, హదీస్4644]
రెండవ రివాయత్: దైవప్రవక్త[స.అ] ఇలా ఉల్లేఖించారు: “అలీ[అ.స] గురించి మూడు విషయాలు నాపై వహీ చేయబడ్డాయి: “అతను ముస్లిముల నాయకుడు, ధర్మనిష్ట కలిగి ఉన్నవారి మార్గదర్శి మరియు కాంతించే మరియు వెలుగుతో నిండి ఉన్న నొసలు గలవారి అధిపతి”[అల్ ముస్తద్రికు అలస్ సహీహైన్, భాగం3, పేజీ148, హదీస్4668]

రిఫ్రెన్
నైషాబూరీ, అల్ ముస్తద్రికు అలస్ సహీహైన్, పరిశోధకుడు: ముస్తఫా అబ్దుల్ ఖాదిర్ అతా, దారుల్ కుతుబ్ అల్ ఇల్మియహ్, బీరూత్, 1411ఖ.
https://www.welayatnet.com/fa/news/147761

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 16 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 23