అలీ[అ.స]ను దూషించటం దైవప్రవక్త[స.అ]ను దూషించటంతో సమానం

మంగళ, 11/12/2019 - 16:25

అలీ[అ.స]ను దూషించటం దైవప్రవక్త[స.అ]ను దూషించటంతో సమానం అని వివరిస్తున్న ఉమ్మె సల్మా గారి రివాయత్...

అలీ[అ.స]ను దూషించటం దైవప్రవక్త[స.అ]ను దూషించటంతో సమానం

ముఆవియహ్ అధికారాన్ని చేజిక్కించుకున్న తరువాత, ఉపన్యాస పీఠాల నుండి ఇమామ్ అలీ[అ.స] పై లఅనత్ చేయమని ఉత్తర్వులు జారీ చేశాడు. అలా జరిగిన తరువాత అబ్దుల్లాహె జదలీ ఇలా అన్నారు: “నేను ఒకరోజు ఉమ్మెసల్మా - దైవప్రవక్త[అ.స] భార్య - వద్దకు వెళ్ళను. ఆమె నాతో ఇలా అన్నారు: “నీవు పీఠం నుండి దైవప్రవక్త[స.అ] గురించి చెడుగా చెబుతున్నావని విన్నాను”
ఉమ్మెసల్మా మాటలు విని ఆశ్చంగా ఇలా అన్నాడు: “మీరేమంటున్నారు. దైవప్రవక్త[స.అ] గురించి చెడుగా చెప్పే విషయంలో నేను అల్లాహ్ శరణం కోరుతున్నాను”
ఉమ్మెసల్మా ఇలా అన్నారు: “నువ్వు అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] గురించి పీఠం నుండి తప్పుగా చెప్పటం లేదా! అల్లాహ్ సాక్షిగా, దైవప్రవక్త[స.అ] అలీ[అ.స]ను ఇష్టపడేవారు మరియు అలీ[అ.స]ను దూషించటం అనగా దైవప్రవక్త[స.అ]ను దూషించినట్లే.
ఈ రివాయత్ ను ఈనాటి వహాబీ ప్రముఖ ఉలమాలలో ఒకరైన “ఆల్ బానీ” ఉల్లేఖించారు. ఈ రివాయత్ లో ఉన్న రావియులందరిని నమ్మకస్తులని భావించారు. ఆ తరువాత ఆ వహాబీ ముహద్దిస్ ఇలా అన్నారు: “అలీ[స.అ] పట్ల దైవప్రవక్త[స.అ] ఇష్టాన్ని వెల్లడించే హదీసులు నిజంగా చాలా ఉన్నాయి”[అల్ అహాదీస్ ఫీ హుబ్బిన్నబీ, భాగం26, పేజీ135]

రిఫ్రెన్స్
ఆల్ బానీ, నాసిరుద్దీన్, అల్ అహాదీస్ ఫీ హుబ్బిన్నబీ, అల్ సిల్సిలతుస్ సహీహ్, బీ.తా, బీ.జా. 

https://www.welayatnet.com/fa/news/147760

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6