జియారత్ షిర్కా లేక సున్నతా!

బుధ, 11/13/2019 - 14:43

జియారత్ షిర్కా లేక సున్నతా! అన్న విషయంలో ఒక ముస్లిం మరియు ఒక వహాబీ మధ్య జరిగిన సంభాషణం...

జియారత్ షిర్కా లేక సున్నతా!

ముస్లిం: నేను ఈ సంవత్సరం మహావీరులైన హజ్రత్ ఇమామ్ హుసైన్[అ.స] యొక్క అర్బయీన్ కు కర్బలా దర్శనానికి వెళ్లాను. నజఫ్ నుండి కర్బలా వరకు నడిచి వెళ్ళే ఆ పుణ్యకార్యంలో పాల్గొన్నాను. అందులో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. అందులో మానవత్వాన్ని చూశాను. అల్లాహ్ కు చాలా దగ్గరయ్యాను అని గ్రహించాను.
వహాబీ: గతించినవారి దర్శనానికి వెళ్ళటం సరికాదు, అతి షిర్క. నువ్వు తప్పు చేశావు, అస్తగ్ఫార్ చేయి లేకపోతే ముష్రిక్ గా మిగిలిపోతావు.[అర్రద్దు అలాల్ ఇఖ్నాయీ, పేజీ18, 52].
ముస్లిం: ఎందుకని ముష్రిక్ అవుతాను, నిజానికి నేను సహాబీయులలో కొందరిని తీరును అనుసరిస్తూనే ఇమామ్ హుసైన్[అ.స] సమాధి దర్శనానికి వెళ్ళాను.
వహాబీ: ఏ ఒక్క సహాబీ కూడా ఇలాంటి పని చేయలేదు, వార మృతుల దర్శనాన్ని అసమ్మతించేవారు., నువ్వు మన పుణ్యపూర్వీకులకు వ్యతిరేకంగా అమలు చేశావు, తప్పకుండా తౌబహ్ చేయాల్సిందే!
ముస్లిం: నువ్వు ఇలా ఎలా చెప్పగలవు; సహాబీయులలో కొందరు సహాబీయుల దర్శనానికి వెళ్లేవారు అని నేను నీకోసం నిరూపిస్తాను.
వహాబీ: సహాబీయులు ఇలా చేసేవారు అని ఒక్క సందర్భం చూపించినా నేను నీ మాటను ఒప్పుకుంటాను.
ముస్లిం: చాలా సందర్భాలు ఉన్నాయి, కాని నేను కేవలం ఒక్క సందర్భం దైవప్రవక్త[స.అ] భార్య అయిన ఆయెషా ఉల్లేనాన్ని ప్రదర్శిస్తాను; అహ్లె సున్నత్ యొక్క ప్రముఖ గ్రంథంలో “ఆయెషా తన సోదరుడైన అబ్దుర్ రహ్మాన్ సమాధిని దర్శించుకోవడానికి వెళ్లెవారు” అని ఉంది. “ఇబ్నె అబీ మలీకహ్” ఇలా ఉల్లేఖించారు: “ఒకరోజు నేను ఆయిషాను సమాధి దర్శనానికి వెళ్ళేందుకు ఇంటి నుండి బయటకు వచ్చారు. అప్పుడు నేను ఆమెను “అయితే, దైవప్రవక్త[స.అ] సమాధుల దర్శనాన్ని నిషేధించలేదా?” అని అడిగాను. ఆమె “అవును! కాని ఆ తరువాత వారు సమాధులను దర్శించేందుకు అనుమతి ఇచ్చారు”[సుననె ఇబ్నెమాజా, భాగం2, పేజీ511] అయ్యా వహాబీ, దైవప్రవక్త[స.అ] భార్య అయిన ఆయెషా యొక్క ఈ చర్య మరియు వారి ఉల్లేఖనం నీకు చాలదా! ఎందుకని దైవప్రవక్త[స.అ] సహాబీయులు చేసిన అమలును వ్యతిరేకించి సమాధుల దర్శనాన్ని షిర్క అని భావిస్తున్నావు!?”
వహాబీ: ఈ రివాయత్ సరైనదో కాదో తెలుసుకోవడానికి ఈ రివాయత్ యొక్క రివాయతుల క్రమాన్ని చూడాలి. ఆ తరువాతే నేను మీకు సమాధానం ఇవ్వగలను.
ముస్లిం: ఈ రివాయత్ యొక్క రావీయుల క్రమం సరైనది. చివరికి వహాబీయుల ప్రముఖ ముహద్దిస్ అయిన “అల్ బానీ” కూడా ఈ రివాయత్ సరైనది అని తాయీదు చేశారు. వారు ఈ రివాయతుల ఆధారంగానే సమాధుల దర్శనాన్ని షరా పరమైన చర్య అని భావించి దానిని సమ్మతించారు.[మన్హజుస్ సలఫీ ఇందషైఖ్ నాసిరుద్దీన్ అల్ బానీ, పేజీ31-32]      

రిఫ్రెన్స్
ఇబ్నె తైమియహ్, హలీముద్దీన్, అర్రద్దు అలల్ ఇఖ్నాయి, ఖాహిరహ్, అల్ మత్బఅతుస్ సలఫియ్యహ్, బీ.తీ/ సుననె ఇబ్నె మాజహ్, పరిశోధకుడు: షుఐబ్ అల్ అర్నూత్, దారుర్ రిసాలతుల్ ఆలమియ్యహ్, 1430ఖ/ అమ్ర్ అబ్దుల్ మున్యిమ్ సలీమ్, అల్ మన్హజుస్ సలఫీ ఇందష్ షైఖ్ నాసిరుద్దీన్ అల్ బానీ.

https://www.welayatnet.com/fa/news/147792

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10