దైవప్రవక్త పట్ల ముస్లిం సమాజము యొక్క కర్తవ్యాలు

బుధ, 11/13/2019 - 18:04

దైవప్రవక్త పట్ల ముస్లిము సమాజానికి గల కర్తవ్యాలలో కొన్నింటిని ఇచట ప్రస్థావించటం జరిగింది.

దైవప్రవక్త,కర్తవ్యాలు,సమాజం.

ఏ అంశాలపై అయితే దివ్యఖురాను చాలా తాకీదు చేస్తుందో వాటిలో “దైవప్రవక్త[స.అ.వ] పట్ల ఇస్లామీయ సమాజం యొక్క కర్తవ్యాలు” కూడా ఒకటి.ఆ కర్తవ్యాలలో దైవప్రవక్త[స.అ.వ] పట్ల విధేయత చూపటం కూడా ఒకటి,దివ్యఖురాను ఈ విధగా సెలవిస్తుంది: “ఈ ప్రవక్తకు విధేయత చూపినవాడు అల్లాహ్ కు విధేయత చూపినట్లే” [నిసా/80]. రెండు, దైవప్రవక్త[స.అ.వ] ల వారిని గౌరవించటం,దివ్యఖురాను ఈ విధంగా సెలవిస్తుంది: “[ఓ ప్రవక్తా!] వారికి చెప్పు: మీరు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి [తత్ఫలితంగా] అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు” [ఆలె ఇమ్రాన్/31]. మూడు, ప్రవక్తతో వాదించరాదు, దివ్యఖురానులో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు: “కానీ ఎవరైనా సన్మార్గం ప్రస్పుటమైన మీదట కూడా ప్రవక్త[స.అ.వ] కు వ్యతిరేకంగా పోతే,విశ్వాసులందరి మార్గాన్ని వీడి,ఇతర మార్గాన్ని అనుసరిస్తే,మేమతన్ని అతను మరల దలుచుకున్న వైపుకే మరల్చుతాము.కడకు అతన్ని నరకంలో పడవేస్తాము” [అన్ నిసా/115]. నాలుగు, ప్రవక్తల వారిని హింసించరాదు,అల్లాహ్ దైవ వాణిలో ఈ విధంగా సెలవిస్తున్నడు: అల్లాహ్ ను,ఆయన ప్రవక్తను బాధించేవారిపై ప్రపంచంలోనూ,పరలోకంలోనూ శాపం పడుతుంది,ఇంకా వారి కోసం అత్యంత అవమానకరమైన శిక్ష సిధ్ధంగా ఉంది [అల్ అహ్జాబ్/57].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17