.ఇమామ్ రిజా[అ.స] సహాబీ అయిన హసన్ ఇబ్నె అలీ ఇబ్నె జియాదె వష్షా ఇలా అన్నారు: “నేను మస్జిదే కూఫాలో తొమ్మిది వందల ఉపాద్యాయులను చూశాను వారందరు కూడా జాఫర్ ఇబ్నె ముహమ్మద్ నుండే హదీసు ను ఉల్లేఖిస్తున్నారు”
ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] యొక్క శిష్యులు “కూఫా”, “బస్రా”, “వాసిత్”, “హిజాజ్” లాంటి వివిధ ప్రదేశాల నుండి వచ్చేవారు. మరి అలాగే వివిధ సమూహాలకు చెందిన వారు ఉదాహరణకు “బనీ అసద్”, “మఖారిఖ్”, “తయ్య్”, “సలీమ్”, “గత్ఫాన్”, “అజ్ద్”, “ఖుజాఅహ్”, “ఖస్అమ్”, “మఖ్జూమ్”, “బనీ జబ్బహ్”, “ఖురైష్” ముఖ్యంగా “బనీ హారిస్ ఇబ్నె అబ్దుల్ ముతల్లిబ్” మరియు “బనిల్ హసన్” సమూహాలకు చెందినవారందరు కూడా ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] విద్యాలయానికి సంబంధించిన వారే.
జాఫరీ విద్యాలయం యొక్క విస్తరణ గురించి చెప్పాలంటే ఇమామ్ రిజా[అ.స] యొక్క శిష్యుల మరియు ప్రముఖ ముహద్దిసీనుల నుండి ఒకరైన “హసన్ ఇబ్నె అలీ ఇబ్నె జియాదె వష్షా” ఇలా అన్నారు: “నేను మస్జిదే కూఫాలో తొమ్మిది వందల ఉపాద్యాయులను చూశాను వారందరు కూడా జాఫర్ ఇబ్నె ముహమ్మద్ నుండే హదీసు ను ఉల్లేఖిస్తున్నారు”.[సీమాయే పీష్వాయాన్, పేజీ95]
రిఫ్రెన్స్
సీమాయే పీష్వాయాన్, మహ్దీ పీష్వాయి, దారుల్ ఇల్మ్, 1388.
వ్యాఖ్యానించండి