ఆయిషహ్ కు అలీ[అ.స] పట్ల ద్వేషం

సోమ, 11/25/2019 - 15:22

ఆయిషహ్, హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స]ను ఎంతగా ద్వేషించేవారు... అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

ఆయిషహ్ కు అలీ[అ.స] పట్ల ద్వేషం

ఉదాహారణకు ఆయిషహ్ మక్కా నుండి తిరిగి వస్తుండగా ఆమెకు ఉస్మాన్ హత్య చేయబడ్డారనే సమాచారాన్ని అందజేశారు. అదివిని ఆమె చెప్పలేనంత సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాని ఎప్పుడైతే ప్రజలు అలీ[అ.స]ని ఖలీఫాగా అంగీకరించి బైఅత్ చేశారని తెలిసిందో మంటతో “అలీ[అ.స]కి ఖిలాఫత్ పదవి దక్కక ముందే నింగి విరిగి భూమిపై పడివుంటే ఎంత బాగుండునో అని నన్ను వెనక్కి తీసుకెళ్ళండి” అని ఆదేశించారు. అప్పటి నుండి ప్రజలను యుధ్ధానికి సిధ్ధం చేసే పనిలో పడ్డారు. ఆమె ఇమామ్ అలీ[అ.స] పేరు వినడానికి కూడా ఇష్టపడనంతగా విరోధాన్ని పెంచుకున్నారు.
అయితే ఆమె దైవప్రవక్త[స.అ] యొక్క ఈ ప్రస్తావన “అలీ[అ.స] పట్ల ప్రేమ ఈమాన్ మరియు అతని పట్ల ద్వేషం వైరానికి నిదర్శనం” అని వినలేదా?. సహాబీయులలో కొందరు “మేము కపట వర్తనులను అలీ[అ.స] పట్ల వైరంతోనే గుర్తిస్తాము” అని కూడా చెబుతూ ఉండేవారు, ఇదీ వినలేదా?. ఆమె దైవప్రవక్త[స.అ] యొక్క ఈ ప్రకటన: “నేనెవరికి స్వామినో ఈ అలీ[అ.స] కూడా వారి స్వామియే” కూడా వినలేదా?.
ఇవన్ని అమె తప్పకుండా విన్నారు. అమెకు ఇవన్నీ తెలుసు. అయినా సరే అమెకు అలీ[అ.స] అంటే ఇష్టముండేది కాదు. ఎప్పుడైతే అతని చావు కబురు విన్నారో వెంటనే సజ్దయే షుక్ర్(అల్లాహ్ సన్నిధిలో కృతజ్ఞత తెలుపుకోవటం)‌లో పడ్డారు.[తబరీ, 36వ అధ్యాయంలో]

రిఫ్రెన్స్
తబరీ, ఇబ్నె అసీర్, మదాయిని మొ॥ 36 హిజ్రీ సంఘటన ప్రస్తావన అధ్యాయంలో.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 26