చేసిన కార్యాలకు ఈ లోకంలోనే శిక్ష

బుధ, 11/27/2019 - 17:25

హజ్రతె మూసా[అ.స] ల వారి కాలంలో నివసించిన ఒక రాజు మరియు ఒక విశ్వాసుని యొక్క ఒక సంఘటన.

హజ్రత్ మూసా[అ.స] ల వారి కాలంలో ఒక క్రూరుడైన రాజు ఉండేవాడు అతడు ఒక రోజు ఒక విశ్వాసుని యొక్క కోరికను తీర్చి అతనికి సహాయపడ్డాడు.ఆ రాజు మరియు ఆ విశ్వాసుడు ఒకే రోజు చనిపోవటం జరిగింది.ఆ రాజు యొక్క శవాన్ని గౌరవప్రదంగా ఖననం చేసారు మరియు మూడు రోజుల వరకు సంతాపాన్ని ప్రకటించటం జరిగింది.కానీ ఆ విశ్వాసి యొక్క శవం మూడు రోజుల వరకు అలాగే పడి ఉంది జంతువులు అతని దేహంపై వాలి అతని ముఖము యొక్క మాంసాన్ని తినేశాయి.మూడు రోజుల తరువాత హజ్రతె మూసా[అ.స] ల వారికి విషయం తెలిసింది.హజ్రతె మూసా[అ.స] ల వారు ఆ అల్లాహ్ తో  “భగవంతుడా! ఆ రాజు నీకు శత్రువు,అతని దేహాన్ని చాలా గౌరవమర్యాదలతో ఖననం చేయటం జరిగింది కానీ ఈ విశ్వాసి నీ దాసుడు అతని దేహం ఇంట్లోనే ఉండిపోయింది అతని ముఖము పైన మాంసాన్ని సైతం జంతువులు తినేసాయి,దీనికి కారణం ఏమిటి” అని ప్రశ్నించారు. దానికి అల్లాహ్ తరపు నుండి హజ్రతె మూసా[అ.స] ల వారికి వహీ వచ్చింది “ఓ మూసా! నా దాసుడు ఆ క్రూరుడైన రాజుతో తన అవసరాన్ని వెల్లుబుచ్చాడు,దానికి ఆ రాజు అంగీకరించి అతని అవసరాన్ని తీర్చాడు.ఆ రాజు చేసిన మంచి కార్యానికి నేను ఈ లోకంలోనే అతనికి ప్రతిఫలాన్ని ఇచ్చాను.కానీ నా దాసుడైన ఆ వ్యక్తి [నన్ను వదిలి] నా శత్రువు వద్దకు వెళ్ళి అతని ముందు చెయ్యిని చాచాడు.నేను కూడా అతని ఈ పనికి ఈ లోకం లోనే శిక్షించాను.ఇద్దరూ తమ తమ కార్యాల యొక్క ఫలితాన్ని ఈ లోకంలోనే చూడటం జరిగింది”.

రెఫరెన్స్: దాస్తాన్ హాయె బిహారుల్ అన్వార్,మహ్మూద్ నాసిరి.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 12 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 24