నూర్ సూరహ్

ఆది, 12/10/2017 - 05:12

.ఎవరైతే తమ కుటుంబ సభ్యులందరూ మంచివారిగా ఉండాలని, చెడు కార్యములు చేయకూడదని, దుర్మార్గులు కాకూడదని భావిస్తారో వారు ఈ సూరహ్ ను తప్పకుండా చదవండి.

నూర్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 24వ సూరా ఇది. “నూర్” అనగ వెలుగు, కాంతి. ఈ సూరాకు సంబంధించిన ఆయత్ ఈ సూరా యొక్క 35వ ఆయత్. ఈ సూరాలో “నూర్” అను పదం 7 సార్లు వచ్చింది. పూర్తి ఖుర్ఆన్ లో “నూర్” అను పదం 43 సార్లు వచ్చింది. ఈ సూరాలో 64 ఆయత్
లు, 1318 పదాలు మరియు 5755 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరాలో “అల్లాహ్” పదం 80 సార్లు వచ్చింది. ఈ సూరా మదీనహ్ లో అవతరించబడింది. దీని కన్నా ముందు “హష్‏ర్” సూరా మరియు దీని తరువాత “హజ్” సూరా అవతరించబడ్డాయి. దీని పేరు “నూర్” అని పెట్టడానికి కారణం ఈ సూరలో ఒక ఆయత్ లో 5 సార్లు నూర్ పదం ఉండడం. ఇందులో స్ర్తీ మరియు పురుషుల హిజాబ్ వివరణ ఉంది, పురుషుల హిజాబ్ వారు వారి కళ్ళను క్రిందికి ఉంచడమే వారి యొక్క హిజాబ్. ఇమామె జాఫరె సాదిఖ్[అ.స] వచనానుసారం మీ మంచి పనులను మరియు గౌరవాన్ని ఈ సూరహ్ పఠనం ద్వార కాపాడుకోండి. ఈ సూరహ్ ద్వార మీ స్ర్తీల గౌరవాన్ని కాపాడుకోండి. ఏ వ్యక్తి అయితే రాత్రింబవళ్ళు ఈ సూరహ్ ను పఠిస్తూ ఉంటాడో అతడి పూర్తి కుటుంబం నుండి ఏ ఒక్కడూ చెడ్డవాడు అవ్వడు మరియు మరణించినప్పుడు 70 వేల దూతలు అతడి సమాధి వరకు అస్తగ్ఫార్ చేస్తూ వెళతారు.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13