అందరు నిద్రపోయే వేళ ఒక విశ్వాసి ఏమి చేయాలి, మరి ఎవరు ఆ సమయంలో అలా అల్లాహ్ ను ప్రార్థించగరు అన్న విషయం పై సంక్షిప్త వివరణ...
ఉషస్సు సమయంలో అశ్రద్ధుల కళ్లు నిద్రతో మూతబడి ఉంటాయి. చుట్టుప్రక్కలు ప్రశాంతంగా ఉంటుంది. ఈలోకపు జీవిత శబ్ధాలూ, అరుపులూ ఏమీ ఉండవు. మనిషి ఆలోచలను నిరంతరం కట్టిపడేసే కారణాలు కూడా నిశబ్ధంగా ఉంటాయి. ఆ సమయంలో కొందరు అల్లాహ్ సన్నిధికి చేరి ఆయన పట్ల వినయవిధేయతలు చాటుకుంటారు మరియు నమాజ్ చదువుతారు మరియు తాము చేసిన తప్పుల పట్ల పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తారు. వారి గురించే ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా సూచించారు: “... ఉషస్సు సమయంలో విత్ర్ నమాజ్ లో 70 సార్లు అల్లాహ్ ను క్షమించమని కోరేవారు వారే”
ఎవరైతే అల్లాహ్ పట్ల ధర్మనిష్ట కలిగి ఉంటారో, పాపముల నుండి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారో వారి ఈ ధర్మనిష్టయే వారికి అల్లాహ్ యొక్క శిక్ష ను గుర్తుచేస్తూ ఉంటుంది. మరి అదే వారికి పాపం చేసిన వెంటనే అస్తగ్ఫార్ చేయిస్తుంది. అలా అల్లాహ్ కారుణ్యానికి దగ్గరవుతారు. [బిహారుల్ అన్వార్, భాగం67, పేజీ279]
రిఫ్రెన్స్
ముహమ్మద్ బాఖిర్ మజ్లిసీ, బిహారుల్ అన్వార్, దారు ఇహ్యాయిత్ తురాస్ అల్ అరబీ, 1403ఖ
వ్యాఖ్యానించండి