దుర్మార్గులతో స్నేహం నరకానికి మార్గం

మంగళ, 12/10/2019 - 15:48

దుర్మార్గులతో స్నేహం నరకానికి మార్గం అని సూచిస్తున్న ఖుర్ఆన్ యొక్క కొన్ని ఆయతుల వివరణ...

దుర్మార్గులతో స్నేహం నరకానికి మార్గం

మనిషి, ఇతర మనుషుల మంచి మరియు చెడు లక్షణాలను చాలా త్వరగా స్వీకరించేటువంటి జీవి, అందుచేత చేతనైనంతవరకు మంచివాళ్ళతోనే ఉండటానికి ప్రయత్నించాలి. చెడ్డవారి నుండి దూరంగా ఉండటమే మేలు, వారి స్నేహం నుండి కాపాడుకుంటు ఉండాలి, ఇలాంటి చెడు స్నేహం మరియు చెడు స్నేహితుల వల్ల ప్రజలు సిగ్గు పడతారు. ఖుర్ఆన్ ఉపదేశం: ఆ రోజు దుర్మార్గుడైన వ్యక్తి తన చేతులను కొరుక్కుంటూ ఇలా అంటాడు: “అయ్యో1. నేను దైవప్రవక్త[స.అ] మార్గాన్ని అనుసరించి ఉంటే ఎంత బావుండేది!”[ఫుర్ఖాన్:27]
ఒకవేళ మనిషి స్వర్గానికి వెళ్ళాలనుకున్నట్లైతే తప్పకుండా మంచి వారితో కలిసి ఉండాలి మరియు తన లోపల నుంచి అన్ని చెడు లక్షణాలను తీసివేయ్యాలి. ఖుర్ఆన్ ఉపదేశం: “సత్కార్యాలలో, అల్లాహ్ భీతితో కూడిన విషయాలలో ఒండొకరికి తోడ్పడుతూ ఉండండి. పాపకార్యాలలో, దౌర్జన్యపు పనుల్లో ఎవరితోనూ సహకరించకండి”[మాయిదహ్:02]
అల్లాహ్ మనల్ని చెడ్డవారి సహవాసం నుండి దూరంగా ఉంచి స్వర్గాన్ని మన నిలయంగా నిర్ధారించుగాక అని సర్వాధికారి అయిన అల్లాహ్ ను నిరంతరం వేడుకోవాలి.[అల్ మిస్బాహ్ లిల్ కఫ్అమీ, పేజీ615]

రిఫ్రెన్స్
అల్ మిస్బాహ్, ఇబ్రాహీమ్ ఇబ్నె అలీ ఆములీ అల్ కఫ్అమీ, దారుర్ రజీ(జాహిదీ), 1405ఖ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12