నమాజు ఏ విధంగా పాపాలనుండి దూరంగా ఉంచుతుంది?

గురు, 12/12/2019 - 12:14

నమాజు ఏ విధంగా పాపాల నుండి దూరంగా ఉంచుతుంది అనే ప్రశ్నకు హదీసుల అనుసారంగా జవాబు.

నమాజు,పాపాలు,దైవప్రవక్త.

దైవవాణిలో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు: [ఓ ప్రవక్తా!] నీ వైపుకు పంపబడిన[వహీ చేయబడిన] గ్రంధాన్ని పారాయణం చేస్తూ ఉండు.నమాజును నెలకొల్పు.నిశ్చయంగా నమాజు సిగ్గుమాలినతనం నుంచి,చెడు విషయాల నుంచి ఆపుతుంది [అంకబూత్/45].కానీ ఈ నమాజు పాపాల నుండి ఏ విధంగా ఆపుతుంది?అనే సందేహం అందరికి కలుగుతుంది.దీనికి జవాబు దైవప్రవక్త[స.అ.వ] ల వారి కొన్ని హదీసులలో దొరుకుతుంది.అన్సారులలో ఒక యువకుడు రోజూ దైవప్రవక్త[స.అ.వ] ల వారితో పాటు సామూహికంగా నమాజు చేసే వాడు కనీ దానికి తోడు పాపాలు కూడా చేసేవాడు.ఈ విషయాన్ని ఒక సారి ప్రవక్త[స.అ.వ] ల వారి దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది.దానికి దైవప్రవక్త[స.అ.వ] ల వారు “చివరికి ఈ నమాజు ఒక రోజు ఇతనిని పాపాల నుండి శుద్ధి చేస్తుంది” అని అన్నారు. వేరొక చోట మహనీయ ప్రవక్త[స.అ.వ] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: “ఒక వేళ మీలో ఒకరి ఇంటికి సమీపంలో ఒక నది ఉండి దానిలో రోజుకు ఐదు సారు స్నానమాచరిస్తే మీ దేహంపై ఏ విధమైన మలినాలైనా మిగిలి ఉంటాయా?” అని ప్రశ్నించారు.దానికి సహాబీయులు ఉండవు అని జవాబిచ్చారు.తిరిగి దైవప్రవక్త[స.అ.వ] ల వారు “నిశ్చయంగా నమాజు కూడా ఈ ప్రవహిస్తున్న స్వచ్చ్చమైన నీరు లాంటిదే.ఎప్పుడైతే ఒక వ్యక్తి నమాజును ఆచరిస్తాడో రెండు నమాజుల మధ్య అతను చేసిన పాపాలు తుడుచుపెట్టుకుపోతాయి” అని అన్నారు.

రెఫరెన్స్: తఫ్సీరె తస్నీం,అయతుల్లాహ్ జవాది ఆములి,1వ భాగము,పేజీ నం:186.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 38